రాజ‌శేఖ‌రా.. ఎప్ప‌టికీ మా గుండెల్లో!

అందరి గుండెల్ని తడిమిన ఆత్మీయత అప్తుల్ని ప్రేమగా తాకిన స్పర్శ. తన వాడిని ఎక్కడున్నా గుర్తుపట్టే పిలుపు. నేనున్నాను అన్న వీపుపై భరోసా. ధిక్కారం, పోరాటం, నిత్య జనసంపర్కం, సంయమనం, సమ్మిళితం — ఇలా…

అందరి గుండెల్ని తడిమిన ఆత్మీయత అప్తుల్ని ప్రేమగా తాకిన స్పర్శ. తన వాడిని ఎక్కడున్నా గుర్తుపట్టే పిలుపు. నేనున్నాను అన్న వీపుపై భరోసా. ధిక్కారం, పోరాటం, నిత్య జనసంపర్కం, సంయమనం, సమ్మిళితం — ఇలా ప్రయాణపు అన్ని దశలను దాటిన ఒక సమయస్ఫూర్తి,

తను ఏమిచ్చినా, ఏమి ఇవ్వలేకపోయినా మనవాడు అన్న సజీవ బంధం
సంక్షేమం – సాగునీరు – అభివృద్ధి కలబోతకు స్వచ్ఛమైన నిలువెత్తు ప్రతీక

ఈ తెలుగునేలపై పుట్టి నేటికి 75 సంవత్సరాలు !
ఆయన  సాగించిన అనితర సాధ్యమైన ప్రయాణానికి వందనాలు !

విగ్రహాలు కూలిపోయినా కూలిపోని వ్యక్తిత్వం ఆయనది !
నిప్పు పెట్టి కాల్చినా బూడిద కాని పనితనం ఆయనది !

కానివాళ్ళు చేసే కనికట్టు ప్రచారం చెరపలేని జ్ఞాపకం ఆయనది !
ఆయనకు నేడు 75వ జయంతి రోజున నివాళి !
రాజ‌శేఖ‌రా…ఎప్ప‌టికీ మా గుండెల్లో!
వైఎస్సార్ జోహార్లు నీకు !