ఆసీస్ గెలిస్తే.. క్రికెట్ కే క్రేజ్ తగ్గుతుందంతే!

ప్రపంచకప్ ఫైనల్ కు సర్వం సిద్ధం అవుతోంది. ఒకవేళ ఇండియా గనుక ఫైనల్ కు చేరి ఉంటే.. మన మూడ్ మరోరకంగా ఉండేది కానీ.. మనోళ్లు సెమిస్ లో పోరాడకుండానే చేతులెత్తేయడంతో ప్రపంచకప్ ఫైనల్…

ప్రపంచకప్ ఫైనల్ కు సర్వం సిద్ధం అవుతోంది. ఒకవేళ ఇండియా గనుక ఫైనల్ కు చేరి ఉంటే.. మన మూడ్ మరోరకంగా ఉండేది కానీ.. మనోళ్లు సెమిస్ లో పోరాడకుండానే చేతులెత్తేయడంతో ప్రపంచకప్ ఫైనల్ కే వీక్షకాదరణ తగ్గిపోయింది! 

క్రికెట్ ఆడే దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న ది ఇండియాలోనే. ఇక వేరే క్రీడల్లో కూడా ఇండియా జట్లేవీ అంత సత్తా చాటకపోవడంతో భారీ జనాభా ఉన్నదేశం క్రికెట్ వీక్షకాదరణకు కేరాఫ్ అయ్యింది.

మరి ఇండియా సెమిస్ లో వెనుదిరిగితే ఫైనల్ కు కళ తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఫైనల్ లో గనుక ఆసీస్ గెలిస్తే.. క్రికెట్ క్రేజ్ మరింత తగ్గుతుంది! ఇండియా ఓటమితో ప్రపంచకప్ కు వీక్షకాదరణ తగ్గినట్టుగానే.. ఆసీస్ విజయంతో కూడా క్రికెట్ కే ఆదరణ తగ్గుతుంది!

ఎందుకంటే.. ఇప్పుడు ఫైనల్ లో ఆసీస్ గెలిచి మరోసారి విశ్వవిజేతగా నిలిస్తే.. ఆసీస్ ఖాతాలో ఇది ఐదో ప్రపంచకప్ అవుతుంది. 1987, 99, 2003, 2007లలో ఆసీస్ ప్రపంచకప్ సాధించుకొంది. 2011లో మాత్రం స్వదేశీ పులి ఇండియా ఆసీస్ ను క్వార్టర్స్ లో ఇంటికి పంపించింది. ఇప్పుడు ఆసీస్ కు సొంత దేశంలో మళ్లీ కలిసి వచ్చింది. ఈసారి మళ్లీ గెలిస్తే.. క్రికెట్ లో ఆసీస్ ది ఏక ఛత్రాధిపత్యం అవుతుంది!

ఆటను దేశాల వారీగా కాకుండా..ఆటగా అభిమానించే వారికి కూడా ఆటపై ఆసక్తి తగ్గుతుంది! ప్రతిసారీ ఆసీసే గెలిచేటట్లు అయితే.. ఇంత పోటీ, హంగామా ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకరి వరస విజయాలు కూడా ఎవ్వరికైనా విసుగు తెప్పిస్తాయ్! ఒకరి చేతిలోనే అతి ఆధిపత్యం ఆ క్రీడకే మంచిది కాదు! 

అదే  ఫైనల్ న్యూజిలాంగ్ గెలిస్తే.. ఒక కొత్త ఫేస్. దశాబ్దాలుగా ఆడుతున్న ఒక జట్టు కళ సాకారం అవుతుంది. ఆటలోకి కొత్త మజా వస్తుంది. ఇప్పటికీ ప్రపంచకప్ ను కలగా కలిగి ఉన్న దేశాలకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. 

ఆసీస్ ఆటగాళ్ల అతి ప్రతిభ క్రికెట్ కే ఆదరణను తగ్గిస్తుందా? లేక కివీస్ కొత్త శకానికి నాంది పలుకుతుందా? వెయిట్ అండ్ సీ!