బీసీసీఐ తీసిన గోతిలో టీమిండియా విల‌విల‌!

రెండు రోజుల్లో ఫ‌లితం వ‌చ్చిన టెస్టు మ్యాచ్ లు కూడా గ‌త మూడు నాలుగేళ్ల‌లో ఇండియాలో జ‌రిగాయి. అహ్మ‌దాబాద్ శివార్ల‌లోని న‌రేంద్ర‌మోడీ స్టేడియంలో అయితే.. ఇలాంటివి జ‌రిగాయి. క‌ట్ చేస్తే.. ఒక సాదాసీదా స్పిన్…

రెండు రోజుల్లో ఫ‌లితం వ‌చ్చిన టెస్టు మ్యాచ్ లు కూడా గ‌త మూడు నాలుగేళ్ల‌లో ఇండియాలో జ‌రిగాయి. అహ్మ‌దాబాద్ శివార్ల‌లోని న‌రేంద్ర‌మోడీ స్టేడియంలో అయితే.. ఇలాంటివి జ‌రిగాయి. క‌ట్ చేస్తే.. ఒక సాదాసీదా స్పిన్ బౌల‌ర్ సాన్ట్న‌ర్ ముందు టీమిండియా బ్యాట్స్ మెన్ నిల‌వ‌లేక‌పోయారు! టెస్ట్ మ్యాచ్ ల‌లో గెల‌వ‌డానికి స్నిన్ ట్రాక్ ల‌ను అతిగా న‌మ్ముకునే స‌రికి మొద‌టికే మోసం వ‌చ్చింది.

గ‌తంలో ఇంగ్లండ్ జ‌ట్టు ఇండియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానే ఇలాంటి ముచ్చ‌ట జ‌రిగింది. మోడీ స్టేడియంలో అప్పుడు వ‌ర‌స‌గా అన్ని టెస్టులూ జ‌రిగితే, తొలి మ్యాచ్ లో ఇండియా ను ఇంగ్లండ్ ఓడించింది. ఆ పిచ్ మీద జో రూట్ కూడా బంతిని గిర‌గిర తిప్పాడు! ఐదు వికెట్ల‌ను తీశాడు. ఈ సాన్ట్న‌ర్ కూడా ఇప్ప‌టికే న్యూజిలాండ్ త‌ర‌ఫున బోలెడు మ్యాచ్ లు ఆడినా తొలి సారి త‌న కెరీర్ లో ఒక టెస్టు మ్యాచ్ లో ప‌ది వికెట్ల ముచ్చ‌ట‌ను తీర్చుకున్నాడ‌ట‌!

సీమ్ ట్రాక్ ల మీద అతిగా ఆధార‌ప‌డి ఆస్ట్రేలియా త‌న స్వ‌దేశంలో టీమిండియా చేతిలో చిత్త‌య్యింది. టీమిండియా త‌ర‌ఫున బుమ్రా, సిరాజ్, ష‌మీల విజృంభ‌ణ‌తో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టీమిండియా వ‌ర‌స‌గా రెండు ప‌ర్యాయాలు టెస్టు సీరిస్ ను నెగ్గుకు వ‌చ్చింది. భార‌త బ్యాట్స్ మెన్ ను బెంబెలెత్తించ‌డం మాట అటుంచి, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ అక్క‌డ నిల‌బ‌డ‌లేనంత స్థాయి ప‌రిస్థితి త‌లెత్తింది. అచ్చం ఇప్పుడు ఇండియాలోనూ అదే జ‌రిగింది.

ప్ర‌త్యేకించి టీమిండియా త‌ర‌ఫున కాస్తంత ఓపిక‌గా ఆడే బ్యాటర్లు లేకుండా పోవ‌డం విచార‌క‌రం. పిచ్ మీద భూత‌మేదీ కూర్చోలేదు. రెండు టెస్ట్ మ్యాచ్ ల‌లోనూ న్యూజిలాండ్ బ్యాట‌ర్లు ఇండియ‌న్ బ్యాట‌ర్ల క‌న్నా చాలా రెట్లు మెరుగ్గా ఆడారు! క‌నీసం రోహిత్, విరాట్ అయినా గ‌తంలో తామాడిన ఇన్నింగ్స్ ల‌ను గుర్తు తెచ్చుకుని కాస్త ఓపిక‌గా బ్యాటింగ్ చేస్తారా.. అంటే వీళ్లు కూడా పెవిలియ‌న్ కు క్యూ క‌ట్ట‌డంలో పోటీ ప‌డ్డారు!

ఇక యువ బ్యాట‌ర్లు క‌నీసం ఒక సెష‌న్ పాటు నిల‌బ‌డి .. త‌మ‌లో టెస్ట్ బ్యాట్స్ మెన్ ఉన్నార‌ని నిరూపించుకునే ఆస‌క్తిని ఏ మాత్రం ప్ర‌ద‌ర్శించ‌లేదు. కొడితే కొడ‌తాం, లేక‌పోతే పెవిలియ‌న్ కు వెళ్లిపోదాం అన్న‌ట్టుగా బ్యాటింగ్ సాగింది. అస‌లు ఇది టెస్టు క్రికెట్ బ్యాటింగ్ కానే కాద‌ని చూసేవారెవ‌రైనా చెబుతారు. అదేమంటే.. పిచ్ మీద వేలెత్తి చూపే ప‌రిస్థితి. మ‌రి పిచ్ ల‌ను ఇలాంటి ప‌రాకాష్ట‌కు తీసుకొచ్చింది ఎవ‌రో ప్ర‌త్యేకంగా భార‌త క్రికెట్ అభిమానుల‌కు వివ‌రించ‌న‌క్క‌ర్లేదు!

12 Replies to “బీసీసీఐ తీసిన గోతిలో టీమిండియా విల‌విల‌!”

  1. నేటి మన బ్యాటర్లకు డిఫెన్స్ ఆడడం అనేది అసలే‌ తెలియదు.‌ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.‌ పూర్తి గా ఒక సెషన్ కూడా నిలబడ‌లేకపోతున్నారు. ప్రత్యర్థి టీమ్ 300,400 కొడితే మన టీమ్ 30,40 పరుగులకే అంతా అవుటవుతున్నారు. ఇది చాలా సిగ్గు చేటు.‌ వెంటనే టీం లీడరును మార్చాలి.‌

  2. I watched a test match in Madras in 1982. Test match is classical. Whereas present day Cricket is a fluke game. How many balls he has faced is not important in today’s cricket.

    రావడం రావడం మొదటి బంతికే సిక్సర్ కొట్టడం. రెండో బంతికి అవుట్. ఇది ఎలా ఉందంటే బడేసాబ్ బండి,అల్లీ సాబ్ ఎద్దులు అన్నట్లుంది.

    No coordination in the team. How can we expect Run Outs in test cricket. Today it has become very very Common.

  3. మరీ అంతగా విచారించనక్కర్లేదు, ఇదేదో క్రికెట్ ఆట ఇంటరెస్ట్ తో ఫిక్సింగ్ జరిగినట్లు ఉంది. లేకపోతే శ్రీలంక లో చిత్తుగా ఓడిపోయిన న్యూజీలాండ్ మనతో గెలవడం ఏమిటి?

    1. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఏదో పెట్టారు, ఈ సిరీస్ లో భారత్ గెలిచి, న్యూజీలాండ్ ఓడితే భారత్ పక్కా ఫైనల్ కి వెళ్తుంది, న్యూజీలాండ్ కి ఎలాంటి ఆశలు ఉండవు, అందుకని బ్రాడకాస్టర్ వ్యూయర్ రేటింగ్స్ కోసం ఫిక్సింగ్ చేసి ఉంటారు.

    2. జై అన్నయ్య ఎక్కడమ్మా..ఫట్ ఫట్..అన్నయ్యని మీకు చెప్పానా.

      అంటే లంకతో ఓడిపొతే మనతో కూడా గా..అలా అని రాజ్యాంగం లో ఉందా

  4. Majak+ styles ku alavatu paddaru, seriousness ledu manavallaku, new Zealand players nu observe cheste, santer, ravindra+ andaru entha serious ness chupettaru, manavallu chudandi, nenu observe chesina vishayam entante mana vallu girl friends tho tiruguthu style chestu future padi chesukuntunnaru, especially gill, rahul, mana tteam gelavalante next matchlo rohit +kohli+ rahul+gill lanu teesesi, pujara+rahane+ srikanth reddy inka evaraina ippudu form lo unna playernu teesukuni ravali+ oka leg spinner tevali , part time bowlers tho bowling veyyali, game chala seriously adi hard work chesi concentration cheyali, nene adali na tarvati batters emi adaleru anna vidanga didi tho adali, appudu new Zealand tho gelustamu, ivvani cheyyaka pithe definatega next match kooda lost aitamu, thank u

  5. ఆటని ప్రేమించి ఆడటం మర్చిపోయారు. 140 కోట్ల మంది తరఫున ,ఒక దేశం కోసం ఆడుతున్నప్పుడు , అలవోకగా వికెట్లు కోల్పోవటం అనేది ఏ రకంగా సమంజసం‌ ‌. పాత వాళ్లు ఆడనప్పుడు, వారిని తప్పించేసి, యువతరాన్ని జట్టులోకి తీసుకోవాలి. 15/ 20 సం. లైనా అదే ఆటగాళ్లని కంటిన్యు చేస్తుంటే, మిగతా వారికి ఇండియా టీం లో స్థానం వచ్చేదెప్పుడు ?

Comments are closed.