గంభీర్.. ఆ రాజ‌కీయాలే చేసుకోరాదూ!

ర‌విశాస్త్రిని కోచ్ గా ఎంపిక చేసిన‌ప్పుడు, కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసిన‌ప్పుడు బోలెడంత క‌స‌రత్తు! అప్పుడు కోచ్ ల ఎంపిక‌ల‌కు క‌మిటీలు. అది కూడా సచిన్, గంగూలీ, ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ. తాము…

ర‌విశాస్త్రిని కోచ్ గా ఎంపిక చేసిన‌ప్పుడు, కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసిన‌ప్పుడు బోలెడంత క‌స‌రత్తు! అప్పుడు కోచ్ ల ఎంపిక‌ల‌కు క‌మిటీలు. అది కూడా సచిన్, గంగూలీ, ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ. తాము కోచ్ ప‌ద‌వికి ఇంట‌ర్వ్యూ చేసింది త‌మ మాజీ స‌హ‌చ‌రుల‌నే అయినా వారు టీమిండియా కోచ్ గా అవ‌కాశం దొరికితే మీ వ‌ద్ద ఉన్న ప్ర‌ణాళిక‌లు ఏమిటో వివ‌రించండి అంటూ సూటి ప్ర‌శ్న‌ల‌నే సంధించి మ‌రీ అప్పుడు కోచ్ ల‌ను ఎంపిక చేశారు! మ‌రి గంభీర్ ను ఎలా కోచ్ గా ఎంపిక చేశారంటే.. ఐపీఎల్ విజేత కాబ‌ట్టి అట‌! కోచ్ గా గంభీర్ నాయ‌క‌త్వంలో ఐపీఎల్ గెలిచార‌ట‌, దానికి ఆయ‌నో అద్భుతాల‌ను సాన‌బ‌ట్టే కోచ్ అట‌!

బీజేపీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచి, అక్క‌డా ప‌నితీరు చూప‌లేక గంభీర్ రెండో సారి పోటీ అవ‌కాశాన్ని కూడా పొంద‌లేక‌పోయాడు! క‌మ‌లం పార్టీ పెద్ద‌ల ఆశీస్సులే ఉన్నాయో, లేక బీసీసీఐ ఎలాగూ షా జీ జేబు సంస్థ‌గా మారింది కాబ‌ట్టి.. అవ‌కాశం ద‌క్కిందో కానీ గంభీర్ కోచ్ అయిపోయాడు. ఆదిలోనే హంసపాదు అన్న‌ట్టుగా ఆఖ‌రికి శ్రీలంక చేతిలో కూడా టీమిండియా వ‌న్డే సీరిస్ కోల్పోయింది. ఆఖ‌రికి శ్రీలంక అని ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేయ‌లిక‌! మ‌రి బంగ్లా దేశ్ ను స్వ‌దేశంలో ఒక ఆట ఆడేసుకున్నారు. అయితే న్యూజిలాండ్ మాత్రం చుక్కలు చూపుతూ ఉంది!

స‌క్ల‌యిన్ ముస్తాక్, ముర‌ళీ, షేన్ వార్న్ ల ను కూడా ఇండియ‌న్ స్పిన్ ట్రాక్ ల‌పై ఆటాడుకున్న చ‌రిత్ర ఉంది టీమిండియాకు! ద‌శాబ్దాల టీమిండియా గ‌మ‌నాన్ని గ‌మ‌నిస్తే.. అవ‌త‌లి జ‌ట్టులో ఎంత‌టి ప్ర‌తిభావంత‌మైన స్పిన్న‌ర్లు ఉన్నా.. టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ ఎంత వీక్ గా ఉన్నా.. స్వ‌దేశంలో ఐదో రోజు కూడా మ‌నోళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒక రోజులో డ‌బుల్ సెంచ‌రీలు పూర్తి చేసిన వారు, సెష‌న్ లో సెంచ‌రీలు పూర్తి చేసిన వాళ్లు, ఇండియా కు అంటూ విదేశీ జ‌ట్లు సాన‌బ‌ట్టుకు వ‌చ్చిన స్పిన్న‌ర్ల‌కు మ‌ళ్లీ అవ‌కాశాలు కూడా లేకుండా చేసిన సంద‌ర్భాలు బోలెడు!

కొలిన్ మిల్ల‌ర్, ఆష్లే గైల్స్ .. ఇలాంటి వారి సంగ‌తి వ‌ద్దు, ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాతేర బెస్ట్ స్పిన్న‌ర్లుగా చ‌రిత్ర‌లో నిలిచే స‌క్ల‌యిన్, ముర‌ళీ, షేన్ వార్న్ లు కూడా ఏ రోజూ ఒక్క సెష‌న్ పాటు టీమిండియా బ్యాట‌ర్ల‌ను ఇండియ‌న్ పిచ్ ల మీద ఇబ్బంది పెట్ట‌లేక‌పోయారు! ఒక్క మ్యాచ్ నుకూడా త‌మ జ‌ట్ల‌ను వారు ఒంటి చేత్తో గెలిపించిన సంద‌ర్భాలు వెదికినా క‌న‌ప‌డ‌వు! అలాంటిది.. ఈ రోజు ఊరూపేరు లేని బౌల‌ర్లు కూడా స్నిన్ ట్రాక్ ల‌పై అల్లాడిస్తున్నారు! మ‌రి బాధ్య‌త ఎవ‌రిది!

క్రీడ‌ల‌న్నాకా., గెలుపోట‌ములు మామూలే అని ఎంత చెప్పుకున్నా.. స్వ‌దేశంలో కివీస్ చేతిలో టెస్టు సీరిస్ ఓడిపోవ‌డం ఎంత‌టి అవ‌మాన‌మో ద‌శాబ్దాల క్రికెట్ చ‌రిత్ర చెబుతూ ఉంది. చివ‌రిసారి టీమిండియా ఇండియాలో టెస్టు సీరిస్ ఓడిపోయింది ఎప్పుడో గూగుల్ లో వెదుక్కోవాలి! గ‌త యాభై యేళ్ల‌లో ఇలాంటిది ఎన్ని సార్లు జ‌రిగిందో చెప్పాలంటే ఎంత‌టి క్రికెట్ పండితులు కూడా గూగుల్ లో పేజీల‌కు పేజీలు వెద‌కాలి! 36 యేళ్ల త‌ర్వాత ఇండియాలో తొలి సారి టెస్టు గెలిచింది కివీస్ అంటేనే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు, టెస్టు నే కాదు సీరిస్ నే త‌న్నుకుపోయి మూడో టెస్ట్ లో గెలిచి క్లీన్ స్వీప్ చేసినా పెద్ద ఆశ్చ‌ర్యం లేని ప‌రిస్థితి!

ప్ర‌పంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో టీమిండియా త‌న హీన‌మైన రికార్డుల‌ను రాసుకునే ప‌నిలో ఉండ‌టం విచార‌క‌రం! వేరే సంద‌ర్భంలో అయితే ఇలాంటి ఓట‌ముల స‌మ‌యంలో కోచ్ ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తాయి. ఓ ప‌ద్ధ‌తి, ప్లానింగ్ ఏమీ అగుపించ‌ని గంభీరుడు ఆ రాజ‌కీయాలే చేసుకుంటే పోయేది క‌దా! స్పిన్ ట్రాక్ ల‌పై ఎలా ఆడాలో జ‌ట్టుకు క‌నీసం మొద‌టి నుంచి నేర్పేందుకు ద్రావిడ్డో, ల‌క్ష్మ‌ణో అయి ఉంటే స‌రిపోయేది క‌దా!

8 Replies to “గంభీర్.. ఆ రాజ‌కీయాలే చేసుకోరాదూ!”

  1. గంబీర్ తప్పు లేదు సినియర్ ఆటగాళ్ళు అడకపోతే గంబీర్ ఏం చేయగలడు

Comments are closed.