యంగ్ క్రికెటర్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సోషల్ మీడియా వేదికగా 'థ్యాంక్స్' చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్య, ఓ అద్భుతమైన క్యాచ్‌ని కూడా అందుకుని భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన విషయం విదితమే. అనంతరం, మ్యాచ్‌కి సంబంధించిన ఫొటోలు జత చేస్తూ, ట్విట్టర్లో 'థ్యాంక్స్' చెప్పిన హార్దిక్, అభిమానుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటున్నాడు.
ఈ మధ్యనే 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్యా, తన క్రికెట్ సహచరుడు కె.ఎల్. రాహుల్‌తో కలిసి పాల్గొన్నాడు.. ఈ క్రమంలో కరణ్ జోహార్ అడిగిన ఓ జుగుప్సాకరమైన ప్రశ్నకు అంతకంటే జుగుప్సాకరంగా సమాధానమిచ్చి ఈ యంగ్ క్రికెటర్స్ ఇద్దరూ వివాదాల్లోకెక్కారు. మహిళల్ని ఉద్దేశించి ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్స్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడమే కాదు, 'ఇకపై ఇద్దరూ క్రికెట్ ఆడే అవకాశమే లేదేమో..' అనే స్థాయికి ఆ వివాదం వెళ్ళిపోయింది.
కొన్నాళ్ళపాటు క్రికెట్‌కి దూరమైపోయిన ఈ యంగ్ క్రికెటర్స్ మీద 'బ్యాన్' ఎట్టకేలకు ఎత్తేసింది బీసీసీఐ. దాంతో హార్దిక్ పాండ్య, న్యూజిలాండ్‌తో మూడో వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ ఆనందాన్ని 'థ్యాంక్స్' చెబుతూ అభిమానులతో హార్దిక్ పంచుకోగా, అభిమానులూ అతనికి 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. కొందరు మాత్రం, హార్దిక్ పాండ్యాకి క్లాస్ తీసుకున్నారు.
'జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు. ఎందుకంటే, నువ్వు ఓ పెద్ద స్టార్‌వి. నిన్ను చాలామంది చిన్న పిల్లలు రోల్ మోడల్‌గా భావిస్తున్నారు. భారత క్రికెట్‌కి నువ్వు ఎంతో సేవ చేయాల్సి వుంది. చాలా మంచి భవిష్యత్తును ముందు పెట్టుకుని, వివాదాలు అవసరమా.?' అంటూ కొంతమంది ఇంకాస్త గట్టిగా క్లాస్ పీకడం గమనార్హం.
మైదానంలో అగ్రెసివ్‌గా కన్పించడమే కాదు, సోషల్ మీడియాలోనూ అదే తరహా పోస్టింగ్స్ పెట్టే హార్దిక్, ఆ జోరులోనే కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షోలో రెచ్చిపోయాడు. కానీ, ఇప్పుడు అతనిలో మార్పు కన్పిస్తోంది. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకోగలిగినవాడే నిజమైన మనిషి. మరి హార్దిక్, తన తప్పు తెలుసుకున్నట్టేనా.? ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడా.? వేచి చూడాల్సిందే.