సినీ తారలకేనా.? గ్లామరస్‌గా మేం మాత్రం ఎందుకు కన్పించకూడదు.? ఈ మాట, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ నుంచి కూడా గట్టిగానే విన్పిస్తోంది. 'మేం వేసుకునే దుస్తుల్లో కాదు, మగాళ్ళ ఆలోచనల్లోనే తేడా వుంది..' అంటూ మహిళా లోకం గొంతు విప్పడం మామూలే.. అదే సమయంలో, మహిళల వస్త్రధారణపై 'నెగెటివ్' కామెంట్లూ సర్వసాధారణమే.
సోషల్ మీడియా పుణ్యమా అని, 'ట్రాలింగ్' మరీ హద్దులు దాటేస్తోంది. సోషల్ మీడియాలో ఏదన్నా 'పిక్' సెలబ్రిటీస్ నుంచి పోస్ట్ అయ్యిందంటే చాలు, ట్రాలింగ్ షురూ అయిపోతోంది. అది ముదిరి పాకాన పడిపోతోంది. 'మీ మైండ్‌సెట్ మార్చుకోండి..' అంటూ సదరు సెలబ్రిటీలకు, మరికొందరు సెలబ్రిటీలు మద్దతు పలుకుతూ 'ట్రాలింగ్' చేసే నెటిజన్లకు క్లాసులు తీసుకోవడమూ పరమ రొటీన్ అయిపోయింది.
తాజాగా, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ 'ట్రాలింగ్'ని ఎదుర్కొంటోంది. దానిక్కారణం పైన మీరు చూస్తోన్న ఫొటోనే. ఏముంది, ఇందులో.! అంటే, చూసేవాళ్ళకి చాలానే కన్పిస్తోంది. జస్ట్, గ్లామర్.. అనుకుంటే అసలు వివాదమే లేదు. చూసి ఊరుకోక, మిథాలీ రాజ్‌కి 'సంస్కారం, డ్రెస్ సెన్స్' నేర్పేందుకు కొంతమంది నెటిజన్లు ప్రయత్నించేశారు. గతంలో ఈ తరహా సమస్యల్ని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా ఎదుర్కొంది. సానియా మీర్జా సంగతి సరే సరి.
సానియా మీర్జా అయితే, 'నా అందం నా ఇష్టం..' అంటూ ఘాటుగా స్పందించింది అప్పట్లో. గుత్తా జ్వాల కూడా అంతే. 'నా వస్త్రధారణను డిసైడ్ చేయడానికి మీరెవరు.?' అని విరుచుకుపడిపోయింది. మరి, మిథాలీ కూడా అలాగే స్పందిస్తుందా.? ఏమోగానీ, ఆమెకైతే మద్దతు ఓ రేంజ్‌లో లభిస్తోంది. మిథాలి, ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే ఓ మణిపూస. ఆమె వస్త్రధారణ గురించి మరీ చీప్‌గా కామెంట్స్.. నాన్సెన్స్ అన్పించకమానదు ఎవరికైనా.