టీమిండియా టార్గెట్‌ 329

ప్చ్‌.. తృటిలో మిస్‌ అయ్యింది. 2015 వరల్డ్‌ కప్‌లో టీమిండియా నిన్నటిదాకా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలవడమేకాక, ప్రత్యర్థుల్ని ఆలౌట్‌ చేసిందిగానీ, ఆస్ట్రేలియాని మాత్రం సెమీస్‌లో ఆలౌట్‌ చేయలేకపోయింది. 7 వికెట్లు తీసిన టీమిండియా…

ప్చ్‌.. తృటిలో మిస్‌ అయ్యింది. 2015 వరల్డ్‌ కప్‌లో టీమిండియా నిన్నటిదాకా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలవడమేకాక, ప్రత్యర్థుల్ని ఆలౌట్‌ చేసిందిగానీ, ఆస్ట్రేలియాని మాత్రం సెమీస్‌లో ఆలౌట్‌ చేయలేకపోయింది. 7 వికెట్లు తీసిన టీమిండియా 328 పరుగులు సమర్పించుకుంది. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. చివర్లో జాన్సన్‌ 9 బంతులే ఎదుర్కొని 27 పరుగులు చేయడంతో, 328 పరుగులు చేయగలిగింది ఆసీస్‌.

స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ, అరోన్‌ ఫించ్‌ అర్థ సెంచరీ మినహా మిగతా ఆసీస్‌ ఆటగాళ్ళెవరూ అర్థ సెంచరీ కూడా చేయలేకపోవడం గమనార్హం. అయితే, టీమిండియా బౌలర్లు పసలేని మైదానంలో బౌలింగ్‌ చేయడానికి కష్టపడ్డారు. వికెట్లు తీయడానికీ, పరుగులు ఆపడానికీ నానా తంటాలూ పడాల్సి వచ్చింది. చివరి పదిహేను ఓవర్లలో మాత్రం ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ని టీమిండియా కాస్తయినా కట్టడి చేయగలిగిందనే చెప్పాలి. లేకపోతే స్కోర్‌ బోర్డ్‌ ఈజీగా 350 దాటేస్తుందని 30 ఓవర్ల తర్వాత అందరికీ అన్పించింది.

ఇక, 329 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగనున్న టీమిండియాని గట్టెక్కించాల్సింది బ్యాట్స్‌మెన్లే. సెమీస్‌ టీమిండియాని ఇంటికి పంపించాలని ఆసీస్‌ తహతహలాడుతోంటే, విజయాల పరంపరను కొనసాగించి ఫైనల్‌కి అర్హత సాధించాలని టీమిండియా ఆరాటపడ్తోంది. టీమిండియా ఫైనల్‌కి వెళ్తుందా.? లేదా.? అన్నది డిసైడ్‌ చెయ్యాల్సింది భారత బ్యాట్స్‌మెన్లే. టార్గెట్‌ పెద్దదే కావడంతో, లక్ష్య ఛేదనలో నమ్మకాలన్నీ విరాట్‌ కోహ్లీపైనే వున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.