ఐర్లాండ్‌ ఇంటికి పాక్‌, విండీస్‌ క్వార్టర్స్‌కి

సంచలనాలేం నమోదు కాలేదు. ఐర్లాండ్‌ ఇంటి బాట పడితే, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాయి. పూల్‌-బిలో యూఏఈతో మ్యాచ్‌లో భారీ విజయంతో వెస్టిండీస్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకున్న విషయం…

సంచలనాలేం నమోదు కాలేదు. ఐర్లాండ్‌ ఇంటి బాట పడితే, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాయి. పూల్‌-బిలో యూఏఈతో మ్యాచ్‌లో భారీ విజయంతో వెస్టిండీస్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకున్న విషయం విదితమే. ఇంకోవైపు పూల్‌-బిలో ఐర్లాండ్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించడంతో పూల్‌-బిలో క్వార్టర్స్‌కి చేరే జట్లు ఫిక్సయ్యాయి.

ఐర్లాండ్‌ – పాకిస్తాన్‌ మ్యాచ్‌ ‘డ్రా’ అవుతుందేమోనని విండీస్‌ కాస్త భయపడ్డా.. అలాంటి ‘మ్యాజిక్‌’ ఏమీ జరగలేదు. పాక్‌పై ఐర్లాండ్‌ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందేమోనని ఐర్లాండ్‌ క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, పాకిస్తాన్‌ ఛాన్స్‌ తీసుకోలేదు. ఐర్లాండ్‌పై బౌలింగ్‌ విషయంలోనూ, బ్యాటింగ్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. విజయాన్ని అందుకుని క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది.

పూల్‌-ఎలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకోగా, పూల్‌-బిలో ఇండియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరుకున్నాయి. టీమిండియా, బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడనుంది. పూల్-ఎలో న్యూజిలాండ్‌, పూల్‌-బిలో ఇండియా పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో వున్న విషయం విదితమే.