కుప్పకూలిన విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌

లీగ్‌ దశ దాటాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోతున్నారు. 4.5 ఓవర్లలో 8 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన…

లీగ్‌ దశ దాటాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోతున్నారు. 4.5 ఓవర్లలో 8 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌, 30 ఓవర్లు వచ్చేసరికి 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిరది. 30 ఓవర్లకు విండీస్‌ పరుగులు కేవలం 102 మాత్రమే కావడం గమనార్హం.

కట్టుదిట్టంగా భారత బౌలర్లు బౌలింగ్‌ చేయడంతో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ విలవిల్లాడారు. 150 పరుగులు చేయడమే గగనంగా మారిపోయిందిప్పుడు విండీస్‌కి. అద్భుతం జరిగితే తప్ప, విండీస్‌ 200 పరుగులు దాటే అవకాశమే లేదు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా పరాజయమెరుగని టీమిండియా, టైటిల్‌ విజేతను తానేనన్న సంకేతాల్ని ఆల్రెడీ పంపేసింది.

ఈ టోర్నీలో డబుల్‌ సెంచరీ చేసిన విండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌, టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేయలనుకున్నాడుగానీ, ఫలితం లేకుండా పోయింది. క్రిస్‌గేల్‌ కోసం పక్కా స్కెచ్‌ వేసిన టీమిండియా కెప్టెన్‌ ధోనీ, తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేశాడు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి గేల్‌ తప్పించుకోవడం గమనార్హం. చివరికి ఒక సిక్సర్‌ 2 ఫోర్లతో 21 పరుగులు చేసి ఐటయ్యాడు క్రిస్‌ గేల్‌. షమీ కట్టుదిట్టమైన బౌలింగ్‌ టీమిండియాకి కలిసొచ్చింది.