వరల్డ్‌ కప్‌: క్వార్టర్స్‌ మ్యాచ్‌లు ఇవే.!

వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఓ దశ ముగిసింది. కీలక దశలోకి 8 జట్లు ప్రవేశించాయి. మొత్తం నాలుగు మ్యాచ్‌లు.. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. ఏ మ్యాచ్‌ని ఏ జట్టు లైట్‌ తీసుకున్నా, అక్కడితో ఆ…

వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఓ దశ ముగిసింది. కీలక దశలోకి 8 జట్లు ప్రవేశించాయి. మొత్తం నాలుగు మ్యాచ్‌లు.. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. ఏ మ్యాచ్‌ని ఏ జట్టు లైట్‌ తీసుకున్నా, అక్కడితో ఆ జట్టు పోరు వరల్డ్‌ కప్‌లో ముగిసినట్టే. పూల్‌-ఎ నుంచి నాలుగు జట్లు, పూల్‌-బి నుంచి 4 జట్లు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టేశాయి. 

పూల్‌-ఎలో టాప్‌ ప్లేస్‌లో వున్న న్యూజిలాండ్‌.. ఒక్క మ్యాచ్‌నీ కోల్పోకుండా తాను చాలా స్ట్రాంగ్‌గా వున్నాననే సంకేతాలు పంపింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌ టీమిండియాదే. ఆడిన అన్ని జట్లనూ ఆలౌట్‌ చేసిన ఘనతను టీమిండియా దక్కించుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో టీమిండియా పూర్తి బలంతో వుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 

ఇక, క్వార్టర్స్‌లో తలపడే ఆయా జట్లు.. ప్రత్యర్థుల వివరాల్ని చూద్దాం.

  • మార్చ్‌ 18: సౌతాఫ్రికా – శ్రీలంక
  • మార్చ్‌ 19: భారత్‌ – బంగ్లాదేశ్‌
  • మార్చ్‌ 20: ఆస్ట్రేలియా – పాకిస్తాన్‌
  • మార్చ్‌ 21: న్యూజిలాండ్‌ – వెస్టిండీస్‌

పై నాలుగు పోటీల్లో గెలుపొందే నాలుగు జట్లు సెమీస్‌లో తలపడ్తాయి. 24న ఫస్ట్‌ సెమీస్‌, 26న సెకెండ్‌ సెమీస్‌లలో గెలిచిన జట్లు, మెల్‌బోర్న్‌ వేదికగా మార్చ్‌ 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడ్తాయి. అక్కడ విజయం ఎవర్ని వరిస్తే.. ఆ జట్టే 2015 వరల్డ్‌ కప్‌ విజేత అవుతుంది.