స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్లెట్స్‌.. ‘పోర్న్‌’డోస్‌ను పెంచేశాయి!

ఇంటర్నెట్‌ అత్యంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చాకా.. పోర్న్‌కి కూడా వీక్షకాదరణ అమితంగా పెరిగిందని వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో ఉండే థియేటర్లలో అడపాదడపా ఏ మలయాళీ డబ్బింగ్‌ బూతు బొమ్మలు పోస్టర్లతో మొదలుపెట్టి…

ఇంటర్నెట్‌ అత్యంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చాకా.. పోర్న్‌కి కూడా వీక్షకాదరణ అమితంగా పెరిగిందని వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో ఉండే థియేటర్లలో అడపాదడపా ఏ మలయాళీ డబ్బింగ్‌ బూతు బొమ్మలు పోస్టర్లతో మొదలుపెట్టి లోపల్లోపల సిసలైన నీలిచిత్రాలు ప్రదర్శించే ట్రెండ్‌ ఉండేది.

అదంతా పదిహేను సంవత్సరాల కిందటి సంగతి. సీడీ ప్లేయర్లు, సీడీలు అందుబాటులోకి వచ్చాకా థియేటర్లలో ఆ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. సీడీల ట్రెండ్‌ దాదాపు ఒక దశాబ్దం నడిచింది.

అవే పట్టణాల్లో సీడీల షాపులు వెలిశాయి. గుట్టుగా నీలిచిత్రాల సీడీలను అమ్మడం వ్యాపారంగా మారింది. అయితే ఒక్కసారిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విస్తృతం అయ్యాకా పరిస్థితి మళ్లీ మారిపోయింది.

స్మార్ట్‌ఫోన్స్‌లో పోర్న్‌ వీక్షణ మొదలైంది. ఊపందుకుంది. ఇక అవే స్మార్ట్‌ఫోన్స్‌కు ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా విస్తృతమయ్యాకా.. పరిస్థితిలో మరింత మార్పు.

ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో పోర్న్‌ పెద్ద వ్యాపారంగా, పెద్ద సమస్యగా కూడా మారింది. ఇండియా వంటి దేశాల్లో న్యాయస్థానాలు నెట్‌లో పోర్న్‌ కంటెంట్‌ పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.

ఇంటర్నెట్‌ వ్యవస్థలో దిగ్గజ కంపెనీలకు కూడా భారత న్యాయస్థానాలు సూచనలు చేశాయి. పోర్న్‌ను అరికట్టమని కోరాయి. అయితే అది జరిగేపని కాదని దాదాపుగా తేలిపోయింది.

భారత్‌లో పోర్న్‌ నిషేధమే.. అయితే, పోర్న్‌కు ఎలాంటి అడ్డుకట్టా లేదు. ఇంటర్నెట్‌లో పోర్న్‌ను ఏరకంగానూ కట్టడి చేయలేకపోయారు. ఈ క్రమంలో ప్రముఖ పోర్నోగ్రపీ సైట్‌ పోర్న్‌హబ్‌.కామ్‌ పదేళ్లను పూర్తి చేసుకుందట.

తాము 2007లో సైట్‌ ప్రారంభించామని.. పదేళ్లను పూర్తి చేసుకున్నామని, విపరీతమైన పోర్న్‌ కంటెంట్‌తో, వీక్షకాదరణతో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ పోర్నోగ్రఫీ సైట్‌గా ఉన్నామని ఆ సైట్‌ ఘనంగా ప్రకటించుకుంటోంది. 

ఈ సందర్భంగా పోర్న్‌ వీక్షణకు సంబంధించి జనాల్లో వచ్చిన మార్పుల గురించి ఆ సైట్‌ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్లెట్ల ద్వారా పోర్న్‌ వీక్షణ గణనీయంగా పెరిగిందనేది.

2007లో తమ సైట్‌లో పోర్న్‌ను ఫోన్ల ద్వారా వీక్షించే వారి శాతం కేవలం ఒకే ఒకటి కాగా, నేడు స్మార్ట్‌ఫోన్ల నుంచి పోర్న్‌ను వీక్షించే వారి శాతం 75 అని ఆ నీలిచిత్రాల సైట్‌ పేర్కొంటోంది. పోర్న్‌హబ్‌. కామ్‌కు మహారాజ పోషకుల్లో భారతీయులు కూడా ముందున్నారు.