Advertisement


Home > Movies - Movie Gossip
టాప్‌ హీరోయిన్‌కి, రాజకీయ నేతకు హాట్‌ ఎఫైర్‌!

తెరపై కనిపించే వాళ్లంటే తగని మోజు.. వారిని ఆరాధించడం, ఊహా సుందరులుగా ఉంచేసుకోవడం సగటు ప్రేక్షకుడి పని అయితే, వారిని అందని చందమామలుగా చూడటం సామాన్యుడి చూపైతే... అందుకోగల సత్తా ఉన్నవాళ్లు మాత్రం ఆబగా అందుకుంటున్నారు. వారితో ఆనందంగా గడుపుతున్నారు.

ఇదంతా ఆఫ్‌ ద రికార్డ్‌ వ్యవహారమే. ఇదంతా వారి ప్రైవేట్‌ వ్యవహారమే.. కాబట్టి దీని గురించి చర్చించడం మూడో వ్యక్తి పనికాదు. అటు హీరోయిన్లకూ ఇష్టపూర్వకంగా, ఇటు రాజజకీయ నేతల ఆసక్తిపూర్వకంగా జరుగుతున్న వ్యవహారమే.

మరి ఈ అంశం గురించి మాట్లాడటం ఎందుకంటే.. వీళ్లు రాజకీయనేతలు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధులు. ప్రజల చేత ఓట్లే చేయించుకుని, ప్రజల సొమ్ముతో సౌకర్యాలు, సదుపాయాలు పొందుతున్న వాళ్లు.. అందునా అధికారంలో ఉన్న వాళ్లు. ప్రజా ప్రతినిధులు అయినందున వారి గురించి, వారి వ్యవహారాల గురించి మాట్లాడాల్సి వస్తోంది. స్త్రీ లోలులుగా గడిపేస్తున్న వీళ్లు ప్రజలకేం న్యాయం చేస్తున్నట్టు? అనే ప్రశ్న ఉంది కాబట్టి ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తోంది.

క్రేజీ హీరోయిన్లను వదలని నేతాశ్రీలు!

ఇండియా లెవల్లోనే చాలామంది రాజకీయ నేతలు సినీ హీరోయిన్ల పాలిట మహారాజ పోషకులు. స్త్రీలోలులుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నారు. నేతల వ్యవహారాలు.. చాలా దూరం వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లో ఒక భన్వరీదేవి, కేరళలో సోలార్‌ సరిత.. ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయా రాష్ట్రాల రాజకీయాలను ఒక కుదుపుకుదిపారు.

మరి రాజస్థాన్‌, కేరళ నేలతది పరమ చీఫ్‌టేస్ట్‌. మరీ దిగజారుడు. పక్కా విటుల్లా ప్రవర్తించారు వాళ్లు. భన్వరీదేవి అయితే ఏమైందో ఎవరికీ తెలీనట్టుగా మాయం చేశారు.. ఏకంగా రాజస్థాన్‌ క్యాబినెట్‌ మంత్రులే ఆ వ్యవహారంలో ఇరుక్కుని విలవిల్లాడారు. భన్వరీ దెబ్బకు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పడకేసింది. భన్వీరీదేవి ఉదంతమే ఆ రాష్ట్రంలో బీజేపీ విజయానికి బాటలు వేసింది.

అలాంటి చిల్లర వ్యవహారాలన్నీ ఉత్తరాది విషయాలు కాగా.. దక్షిణాదిన మాత్రం నేతల టేస్ట్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. లీడింగ్‌లో ఉన్న హీరోయిన్లపై వీళ్లు మనసు పారేసుకుంటున్నారు. అలాంటి వ్యవహారాల్లో ఒకటి హాట్‌ టాపిక్‌గా మారింది తెలుగు రాజకీయాల్లో. ఒక ప్రముఖ నేతకు మరో హీరోయిన్‌కు నడుస్తున్న వ్యవహారం ఆసక్తికరంగా.. హాట్‌ టాపిక్‌గా ఉంది. పచ్చిగా చెప్పాలంటే ఆ నటీమణిని ఉంచేసుకున్నాడట ఆ నేత.

మరి తెలుగు రాజకీయాల్లోని నేతల నేపథ్యాలను చూస్తే.. అందరూ పక్కా టార్గెట్స్‌తో ఉన్నారు. అల్లాటప్పా నేతల సంగతిని పక్కనపెడితే కొందరు పక్కా లక్ష్యంతో ఉన్నారు. ముఖ్యమంత్రి అయిపోవాలనో.. తమ పార్టీనే అధికారంలో ఉంచేయాలనో కొందరికి టార్గెట్లు ఉన్నాయి. ఇలాంటి లక్ష్యాలు ఉన్నవాళ్లు.. హీరోయిన్ల మీద మనసు పారేసుకునేంత తీరికలతో ఉండరు.

నిజమే.. ప్రత్యేకంగా టార్గెట్లు పెట్టుకున్న వారు కాదు, ఎలాంటి బాదరబంధీలేని ఒకనేత మాత్రం బిందాస్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాడని టాక్‌. ఏదైనా దాగుతుంది కానీ, రంకు దాగదు కదా.. ఈ వ్యవహారం ఆయన పార్టీ నేతల దగ్గర నుంచినే మీడియా వరకూ వచ్చింది.

మీడియా సర్కిల్స్‌లో చర్చగా మారింది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీడియాలో ఇలాంటి చర్చలు చేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకోవడం తప్ప అంతకు మించిన విషయం లేదు మరి. సదరు నేత మీడియాకు అత్యంత ఆప్తుడు కాబట్టి.. ఎవ్వరూ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. వైభవం అలా నడుస్తూ ఉండటంతో అంతా కిక్కురమనకుండా ఉన్నారు.

మరి సదరు హీరోయిన్‌ ఎవరంటే.. టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతున్న భామ. ఎక్కడో ఉత్తరాది నుంచే వచ్చినప్పటికీ ఇక్కడ సూపర్‌ సక్సెస్‌లు అందుకుని ఊపేస్తోంది. తెలుగు ప్రేక్షుల పాలిట క్రేజీగా మారింది. అలా ఆమెకు ఫ్యాన్‌ అయిన వారిలో సదరు నేతాశ్రీ కూడా ఒకరు. ఎలా ఏర్పడిందో కానీ, ఇద్దరికీ పరిచయం.. ప్రణయం ఏర్పడింది. దీంతో సుఖప్రదంగా సాగిపోతోంది వ్యవహారం.

వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ హీరోయిన్‌కి ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీకాదు. గతంలో ఒక సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన చోటా హీరోతో సరస సల్లాపాలను సాగించింది. ఇద్దరూ ఒక గెస్ట్‌హౌస్‌లో సహజీవనమే చేశారు.

పొలిటీషియన్‌ ఎంట్రీ వరకే అది నడిచింది. ఒక్కసారి ఈయన ఎంటర్‌ అయ్యాకా ఆమె ఇతడి హ్యాండోవర్‌లోకి వచ్చింది. అలా ఎంజాయ్‌ చేసేస్తున్నారు. అయినా అధికారంలో ఉన్న వాళ్లపై అందరి కళ్లూ ఉంటాయి. కానీ వాటికి సదరు నేత భయపడటం లేదు! ఎంతకాలమో చూడాలి.

గ్రేటర్‌ నేతది మరో కథ...

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధికి చెందిన ఒక సీనియర్‌ నేత మొన్నటి వరకూ మరో రసకందాయకమైన వ్యవహారాన్ని నడిపించాడు. తమ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో బీభత్సంగా సంపాదించేసిన ఈ నేత ఆ డబ్బునేంచేసుకోవాలో తెలియనట్టుగా ఈ తరహా ఎంజాయ్‌మెంట్‌ వైపు మరిగాడు. ఒక ప్రముఖ హీరోయిన్‌పై మనసు పారేసుకుని ఆమెతో ఒక స్టార్‌ హోటళ్లో కాపురమే పెట్టేశాడు.

పెళ్లై.. పిల్లలకు కూడా పెళ్లిళ్ల దశలో ఆయన అలా వ్యవహరించడం గమనార్హం. ఒక మలయాళీ బొద్దు భామ మీద ఈ నేత మనసుపడ్డాడు. ఆమెతో చాన్నాళ్ల పాటు వ్యవహారాన్ని నడిపించాడు. ఒకదశలో జర్నలిస్టులు ఆయనను కలవాలంటే స్టార్‌ హోటల్‌కు వెళ్లాల్సి వచ్చేది.. వ్యవహారం అలా వెలుగులోకి వచ్చింది.

అయితే ఆ నేత లెక్క చేయలేదు. ప్రచారం రావడం తనకూ మేలే... అనేంత క్రేజీగా వ్యవహరించాడాయన. అలాంటి ఎంజాయ్‌మెంట్స్‌కు అలవాటుపడిన ఆయన ఆ తర్వాత రాజకీయంగా ఫెయిల్యూర్‌ అయ్యాడు. మరి పవర్‌లో ఉన్నవారికి కూడా నేత లైఫ్‌ గుణపాఠమేమో.

బాలీవుడ్‌ హీరోయిన్లనూ వదలడం లేదు.

తెలుగు రాజకీయ నేతలంటే వారిని తక్కువ అంచనా వేయొద్దు. లోకల్‌ మేడ్‌ హీరోయిన్లను, దక్షిణాదిన పేరున్న హీరోయిన్ల మీదే కాదు.. వీళ్లు బాలీవుడ్‌ భామలను కూడా తెచ్చుకునేంత శక్తి యుక్తులున్న వాళ్లు.

వర్మ కంపెనీలో బాగా ఫేమస్‌ అయిన ఒక హీరోయిన్‌పై మనసుపడ్డ ఒక తెలుగు రాజకీయ నేత ఆమెను బాగానే పోషించాడు. వారి వ్యవహారం చాలాకాలం నడిచింది. మరీ బాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన భామతో ఆయన ఎంజాయ్‌ చేయడాన్ని చూసి మిగతావాళ్లు కుళ్లుకుని చచ్చారు.

ఇక డైరెక్టుగా రాజకీయాల్లోకి వచ్చిన వారిపై కూడా బోలెడన్ని రూమర్లు ఉండనే ఉన్నాయి. అందరూ కాదు కానీ.. కొందరి విషయంలో అలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఒక హీరోయిన్‌.. ఒక నేత స్వార్థానికి బాగా ఉపయోగపడిందనే మాట ఆంధ్రదేశంలో గట్టిగా వినిపించింది.

తర్వాతి కాలంలో సదరు నటీమణి సదరు నేత తనను స్వార్థం కోసం సాంతం వాడేశాడని తన సన్నిహితుడొకరికి చెప్పుకుని ఆవేదనభరితురాలైంది. మరి వీళ్లే కాదు.. అధికారం చేతిలో ఉన్న వారి కోసం హీరోయిన్లను ఎరగా వేస్తున్న సినిమా వ్యక్తులకూ లోటు లేదు.

హైదరాబాద్‌లో స్టూడియో కట్టుకోవడానికి స్థలాన్ని పొందడానికి అప్పటి యంగ్‌ హీరోయిన్‌ ఒకరిని నాటి పవర్‌లోని ఒక నేతకు ఎరగా వేశాడు ఒక బడా నిర్మాత. పనైపోయింది. ఆ హీరోయిన్‌కు ఏదో కొంతమొత్తం పడేసి.. వందలకోట్ల విలువైన భూమిని తన సొంతం చేసుకున్నాడాయన. ఇలా చూస్తే.. హీరోయిన్ల జీవితాలూ అన్యాయం అయిపోతున్నాయి పాపం.