నిజం.. శృంగారం ఒక దివ్యౌషదం..!

చాలా సహజమైన శారీరక కోరిక సెక్స్‌. ఈ బేసిక్‌ ఇన్‌ స్టింక్ట్‌ విషయంలో మోటివేషన్‌ ను ఇచ్చే ముచ్చట్లు మరెన్నో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పేదేమిటంటే.. సెక్స్‌ కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు,…

చాలా సహజమైన శారీరక కోరిక సెక్స్‌. ఈ బేసిక్‌ ఇన్‌ స్టింక్ట్‌ విషయంలో మోటివేషన్‌ ను ఇచ్చే ముచ్చట్లు మరెన్నో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పేదేమిటంటే.. సెక్స్‌ కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా. ఒకటి కాదు రెండు కాదు.. సురక్షిత లైంగిక సంపర్కంతో శరీరానికి బోలెడన్ని లాభాలున్నాయి. సెక్స్‌ ఛీ కొట్టబడే కోరిక ఏ మాత్రం కాదు.. అని, అమితానందాన్ని ఇచ్చే లైంగిక కలయిక సృష్టి మనుగడకే గాక.. మనిషికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని పరిశోదకులు చెబుతారు.

స్ట్రెస్‌, యాంగ్జైటీని తగ్గిస్తుంది!

ఈ తరానికి బాగా ఇబ్బందికరమైన సమస్య.. మానసిక ఒత్తిడి. దీని నివారణకు సెక్స్‌ ఒక దివ్యౌషధం అని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఏదో అర్రీబుర్రీగా చెప్పడంలేదు, కల్పితం కూడా కాదు. ఎలాంటి ఒత్తిడిని అయినా శరీరంలోని హార్మోన్లు బ్యాలెన్స్‌ చేయగలవు. అలాంటి హార్మోనల్‌ యాక్టివిటీ సెక్స్‌తో పెరుగుతుందని శృంగారం రంగ పరిశోధకులు వివరిస్తున్నారు. అరటిపండు స్ట్రెస్‌ లెవల్స్‌ను బ్యాలెన్స్‌ చేయగలదు.. సెక్స్‌ అంతకన్నా చాలా శక్తిమంతమైనదని వీరు వివరిస్తున్నారు.

సెక్స్‌ ఒక పెయిన్‌ కిల్లర్‌..

మానసికమైన ఆరోగ్యాన్నే కాదు.. శారీరక ఆరోగ్యాన్ని కూడా సెక్స్‌ కాపాడుతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలో.. ఎండార్ఫిన్స్‌ అనేది జనిస్తుంది. ఇది మార్ఫిన్‌ తరహా పెయిన్‌ కిల్లర్‌. భుజాలు, మోకాళ్ల నొప్పులకు మార్పిన్‌ను సజెస్ట్‌ చేస్తారు వైద్యులు. అలాంటి మార్ఫిన్‌ ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది శృంగారం. సెక్స్‌ కేవలం ఫన్‌ మాత్రమే కాదు.. అంతకు మించినది!

వ్యాధి నిరోధకతను పెంచుతుంది..

వ్యాధి నిరోధకత.. ఇదున్న వాడు రాజానే. అంతా ఒకే పరిస్థితుల మధ్య బతుకుతున్నాం, ఒకే వాతావరణంలో ఉంటున్నాం.  కానీ వ్యాధినిరోధక శక్తి శరీరానికి కలిగిన వారు అదృష్టవంతులే. మరి ఆ ఇమ్యూనిటీ పవర్‌ను సెక్స్‌ పెంచగలదని అనేక అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. చెబుతూ పోతే ఇంకెన్నో.. భవిష్యత్తులో రాబోయే హృద్రోగాల నివారణకు కూడా సెక్స్‌ ఉపకరిస్తుందని మరి కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇలాంటి వాటి సారంశాన్ని బట్టి.. సెక్స్‌ అనేది కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు, అది దుష్టులకే కలిగేది కాదు. అదొక అద్బుతేం అంతే!