కాస్త గ్యాప్ తరువాత రాజ్ తరుణ్ సినిమా తెరపైకి వస్తోంది. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త అంటూ మాంచి హిలేరియస్ కామెడీ సినిమా అందిస్తున్నాం అంటున్నాడు రాజ్ తరుణ్. ఆ వివరాలు
* మరీ ఇంత గ్యాప్ ఎందుకనో?
ఎందుకంటే అంటే.. ఒక కారణం అని కాదు. మూడు సినిమాలు వరుసగా విడుదలైపోయాయి. సినిమా చూపిస్తామావా, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. దీంతో కొత్తగా ప్రారంభించి, ఫినిష్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఈ నెల కిట్టూగాడు. ఆ తరువాత అంథగాడు విడుదలకు రెడీ అయిపోతోంది. ఆపైన అన్నపూర్ణ బ్యానర్ లో చేస్తున్న సినిమా రెడీగా వుంటుంది. మళ్లీ కొత్త సినిమా అంటే కాస్త గ్యాప్ తప్పదు కదా?
* ప్లాన్డ్ గా విడుదల చేసుకోవచ్చు కదా? అందరికీ ఈ సమస్య రావడం లేదు కదా?
ప్లాన్డ్ గా చేద్దామనే వుంటుంది. కానీ ఒక్కోసారి అన్నీ మన చేతిలో వుండవు. నిజానికి ఈ సినిమా కాస్త ముందే రావాల్సింది. టైమ్, డేట్లు, థియేటర్లు.. ఇలా చాలా వుంటాయిగా.
* అంతేనా..మీ కూడికలు, తీసివేతలు వుంటాయా?
అస్సలు వుండవు. స్క్రిప్ట్ దాకానే మనం. ఆ తరువాత దర్శకుడే.
* మరి ఎందుకు వస్తాయి మీపై గ్యాసిప్ లు. మీరే డైరక్టర్ డ్యూటీలో వేలు పెట్టేస్తారని.
నేను డైరక్టర్ ను అవుదామని వచ్చాను కదా? అందుకనేమో?
* నాని కూడా ఆ డిపార్ట్ మెంట్ నుంచే వచ్చాడు కదా?
అవును కానీ, తనకు డైరక్షన్ చేయను అని చెప్పేసాడు. నేను చెప్పలేదుగా?
*అలా అయితే మీరు చెప్పేస్తే, మీపై కూడా గ్యాసిప్ లు వుండవేమో?
అబద్ధం ఎందుకు చెప్పాలి? ఎప్పటికో డైరక్షన్ చేస్తానేమో?
* స్క్రిప్ట్ లు నచ్చే విషయంలో మరీ మీరు పట్టింపులకు పోవడం వల్ల సినిమాలు చేజారిపోతున్నాయని.
అయివుండొచ్చు. ఒకటో రెండో? వందశాతం నచ్చకుండా చేయలేను కదా?
* కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకటే స్క్రిప్ట్ అందరికీ నప్పేలా తయారవుతోంది. ఒకరు కాదంటే మరొకరి దగ్గరకు వెళ్లిపోతున్నారు కదా?
అదీ నిజమే. ఎవరికి ఏ స్క్రిప్ట్ ప్రాప్తమైతే వారికే అనుకుందాం.
* అంథగాడులో గుడ్డివాడుగా వేస్తున్నారు.. కమర్షియల్ పాయింట్లు చూసుకున్నారా?
ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ మీదే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాత్రమే అలా కనిపిస్తాను. ముందు లైన్ విన్నపుడు నేను భయపడ్డాను. ఆర్ట్ సినిమా ఏమో అని. కానీ పూర్తి స్క్రిప్ట్ వింటుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. అంత హిలేరియస్ గా వుంటుంది.
*అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా సంగతేమిటి?
అది కూడా అంతే. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.
* అంటే ఇక ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కు ఫిక్సయిపోయినట్లేనా? మీ తోటి హీరోలు రొమాన్స్ కూడా చూసుకుంటున్నారు.
అన్నీ కలిసిన సబ్జెక్ట్ వస్తే సంతోషమే. కానీ అదే కావాలి అని కూచుంటే సినిమాలు చేయలేం.
* కిట్టూగాడికి హంసానందినితో అయిటమ్ సాంగ్ అవసరమా?
అవసరమే. ఎందుకంటే సెకెండాఫ్ లో సాంగ్స్ లేవు. ఓ దగ్గర మ్యూజిక్ రన్ అవుతుంటే సీన్స్ జరుగుతుంటాయి. అక్కడ మ్యూజిక్ బదులు సాంగ్స్ పెడితే ఎలా వుంటుందీ అనుకున్నాం. అలా మార్చాం.
* సెకండాఫ్ మొత్తానికి పాటలు లేకపోయినా కష్టమే కదా?
కానీ ఇక్కడ సినిమా ఫాస్ట్ గా పరుగెడుతుంటుంది. అక్కడ పాటలు పెట్టినా బ్రేక్ కింద వుంటాయి. అందుకే ప్లాన్ చేయలేదు.
* దిల్ రాజు గారి బ్యానర్ లో సినిమా ఎప్పుడు?
అన్నపూర్ణ బ్యానర్ సినిమా అయిపోగానే. అలాఎలా సినిమా దర్శకుడు మాంచి ఫన్ స్క్రిప్ట్ రెడీ చేసారు.
* స్వంత ఇల్లు రెడీ అవుతున్నట్లుంది
అవున్ జూన్ కు రెడీ అయిపోతుంది.
* మరి ఇల్లాలు?
2019కి వచ్చేస్తుంది
* అంటే ఫిక్స్ అయిపోయినట్లేనా?
లేదు. 2019కి చేసుకుంటా అంటున్నా
* పెద్ద బ్యానర్లలో సినిమాలు ఎప్పుడు?
చేసినన్నీ ఒకటో, రెండో తప్పిస్తే అన్నీ పెద్ద బ్యానర్లే. డైరక్టర్లు మాత్రం పెద్దా చిన్నా చూడను. మంచి స్క్రిప్ట్ కావాలి. అదే నా పద్దతి.
వెరీగుడ్. బెస్టాఫ్ లక్
థాంక్యూ