నాగచైతన్య ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

నాకంటూ ఒక బ్రాండ్‌ ఉండాలని నాన్నగారు అంటారు-  నాగ చైతన్య   Advertisement అక్కినేని వంశానికి ఉన్న ‘రొమాంటిక్‌ హీరోస్‌’ ఇమేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్యారీ చేస్తూ ఎనిమిది సినిమాల కెరీర్‌లో ‘ఏ మాయ చేసావె’,…

నాకంటూ ఒక బ్రాండ్‌ ఉండాలని నాన్నగారు అంటారు-  నాగ చైతన్య

 

అక్కినేని వంశానికి ఉన్న ‘రొమాంటిక్‌ హీరోస్‌’ ఇమేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్యారీ చేస్తూ ఎనిమిది సినిమాల కెరీర్‌లో ‘ఏ మాయ చేసావె’, ‘100% లవ్‌’, ‘తడాఖా’, ‘మనం’లాంటి విజయాలని కైవసం చేసుకున్న నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ అనే మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో చైతన్యతో గ్రేట్‌ఆంధ్ర జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ…

watch full video interview of Naga Chaitanya

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సోలో హీరోగా ఇదే మీ ఫస్ట్‌ ఫిలిం. హోమ్‌ బ్యానర్‌లో చేయడానికి ఇంత టైమ్‌ ఎందుకు తీసుకున్నారు?

పర్టిక్యులర్‌ రీజన్‌ అంటూ ఏమీ లేదండీ. నాన్నగారు నాతో అనేవారు… ‘‘మనకో బ్యానర్‌ ఉంది, రామానాయుడిగారి బ్యానర్‌ ఉంది. నువ్వు ఈ బ్యానర్స్‌లోనే చేయాలని రిస్ట్రిక్షన్స్‌ ఏమీ పెట్టుకోకు. ఇంకా చాలా బ్యానర్స్‌ ఉన్నాయి. ఎవరి నుంచి మంచి ఆఫర్స్‌ వచ్చినా వదులుకోకు. మంచి ప్రాజెక్ట్‌ అవుతుందని అనిపిస్తే ఓకే చెయ్‌’ అని. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత విజయ్‌కుమార్‌ కొండా నన్ను ‘మనం’ షూటింగ్‌లో కలిసారు. ‘ఒక లైలా కోసం’ కథ చెప్పారు. నాకు నచ్చింది. ఆయనకి వేరే ఏ ప్రొడ్యూసర్‌తోను కమిట్‌మెంట్‌ లేదని చెప్పారు. ఆ విషయం నాన్నగారికి చెప్తే… ‘‘అయితే ఇది మన బ్యానర్‌లోనే చేద్దాం. నీకు కూడా ప్రొడక్షన్‌ సైడ్‌ ఇంట్రెస్ట్‌ ఉంది కదా. కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ కూడా వచ్చింది కాబట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్‌ హ్యాండిల్‌ చేయగలవనే నమ్మకం నాకుంది. దీనిని నువ్వే టేకప్‌ చెయ్యి’ అనడంతో ‘ఒక లైలా కోసం’ మా బ్యానర్‌లోనే చేసాం. 

అంటే దీనికి నిర్మాత కూడా మీరేనా?

ప్రొడక్షన్‌ యాక్టివిటీస్‌ వరకు చూసుకున్నాను. ఇంకా నేర్చుకునే స్టేజ్‌లోనే ఉన్నాను కాబట్టి మొత్తం నేనే హ్యాండిల్‌ చేయలేదు. మెయిన్‌ వర్క్‌ అంతా నాన్నగారిదే. 

‘ఒక లైలా కోసం’ మీ కెరీర్‌లో ఎలాంటి రోల్‌ ప్లే చేస్తుందని అనుకుంటున్నారు?

సినిమా చూసానండీ. వెరీ మచ్‌ శాటిస్‌ఫైడ్‌. సినిమాతో పర్సనల్‌గా నేను చాలా హ్యాపీ. యాక్టర్‌గా నేను ఇంతవరకు చేసిన రోల్స్‌కి దీనికి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. నాగచైతన్య ప్రతి సినిమాతోను నటుడిగా ఎదుగుతున్నాడు అనేది అయితే ఆడియన్స్‌కి తప్పకుండా అనిపిస్తుంది. ఇక అవుట్‌పుట్‌ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. 

లవ్‌స్టోరీస్‌తో సక్సెస్‌ అవుతున్నారు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారా?

ఎంజాయ్‌ చేస్తున్నాను… ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ కొంచెం డిజప్పాయింట్‌మెంట్‌ కూడా ఉంది. నాకు అన్ని జోనర్స్‌ ఆఫ్‌ మూవీస్‌ చేసి నాగచైతన్య ఆల్‌రౌండ్‌ యాక్టర్‌ అనిపించుకోవాలని ఉంది. సెకండ్‌ మూవీ నుంచే రొమాంటిక్‌ రోల్స్‌లో నన్ను ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేసారనే ఆనందం ఉంది. అలాగే యాక్షన్‌ మూవీస్‌తో కూడా ప్రూవ్‌ చేసుకోవాలనే ఛాలెంజ్‌ కూడా ఉంది. 

watch full video interview of Naga Chaitanya

మరి ఆ దిశగా ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

ఆ ట్రయల్స్‌ జరుగుతూనే ఉంటాయండీ. సినిమా, సినిమాకీ ఆ వేరియేషన్‌ తీసుకురావాలి. ఏ రెండు సినిమాలు ఒకలా ఉండకూడదు. ఎంత ఎఫర్ట్‌ పెట్టినా కానీ కొన్ని ఫెయిలవుతుంటాయి. కొన్ని సక్సీడ్‌ అవుతుంటాయి. ఫెయిల్యూర్‌లో జరిగిన మిస్టేక్స్‌ నుంచి నేర్చుకుని, అవి కరెక్ట్‌ చేసుకుని నెక్స్‌ట్‌ ఫిలిం ఎటెంప్ట్‌ చేస్తూ వెళుతూ ఉంటే డెఫినెట్‌గా ఏదో ఒక టైమ్‌లో ఆ సక్సెస్‌ వస్తుంది. 

మీరు చేసిన యాక్షన్‌ మూవీస్‌లో చాలావరకు ఫెయిలవడానికి కారణం ఏంటని మీరనుకుంటున్నారు?

స్క్రిప్ట్‌ జడ్జ్‌మెంట్‌ మెయిన్‌ రీజన్‌ అండీ. కథ వినేటప్పుడు బాగానే అనిపిస్తుంది… కానీ ఎక్కడో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కొన్ని మనం మేకింగ్‌ స్టేజ్‌లో కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో కానీ రియలైజ్‌ అవుతాం. వాటిని కరెక్ట్‌ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు మిస్టేక్స్‌ ఎక్కడ ఉన్నాయనేది కూడా తెలుసుకోలేం. చాలా సార్లు ఆ కథ విని ఉండడం వల్ల… దానిలో ఇన్‌వాల్వ్‌ అయి ఉండడం వల్ల తప్పులు ఉన్నా కానీ గుర్తించలేం. 

మీరు చేసిన మూవీస్‌లో ఇది చేసి ఉండాల్సింది కాదు.. అని రిగ్రెట్‌ అయింది ఏదైనా ఉందా?

అలా ఏమీ లేదండీ. కొన్ని మూవీస్‌ డిజప్పాయింట్‌ చేసాయి కానీ రిగ్రెట్స్‌ అయితే ఏమీ లేవు. 

ఇప్పుడు హీరోస్‌ ఎక్కువ సినిమాలు చేయడానికి అంతగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. కానీ మీరు మాత్రం వచ్చిన అయిదేళ్లలో ఆల్రెడీ పదవ సినిమా చేస్తున్నారు..

ఇయర్‌ రెండు, మూడు సినిమాలు చేయాలని టార్గెట్‌ అయితే ఏమీ పెట్టుకోలేదు. లక్కీగా నాకు వరుసగా ప్రాజెక్ట్స్‌ సెట్‌ అవుతున్నాయి. బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ అవుతున్నాయా, ఫెయిలవుతున్నాయా అనేది పక్కన పెడితే నేను కనెక్ట్‌ కాగలిగే స్క్రిప్ట్స్‌ నాకు వస్తున్నాయి. స్క్రిప్ట్‌ కనెక్ట్‌ అయితే డెఫినెట్‌గా ఎటెంప్ట్‌ చేస్తాను. అలాగే నాకు కనెక్ట్‌ అయ్యే స్క్రిప్ట్‌ రాకపోతే మాత్రం గ్యాప్‌ తీసుకుంటాను. 

మీతో యాక్ట్‌ చేసిన సమంత స్టార్‌ హీరోయిన్‌ అయింది. తమన్నాకి మీతో చేసిన తర్వాతే బ్రేక్‌ వచ్చింది. పూజా హెగ్డే కూడా ఒకలైలా కోసం తర్వాత స్టార్‌ అవుతుందని అనుకుంటున్నారా?

(నవ్వుతూ) పూజకి ఆల్రెడీ హృతిక్‌ రోషన్‌తో మూవీ ఓకే అయింది. నేను లక్కీ ఛార్మ్‌ అని అనడం లేదు. డెఫినెట్లీ దే ఆర్‌ టాలెంటెడ్‌ అందుకే వాళ్లకి పెద్ద ఆఫర్స్‌ వస్తున్నాయి.  

ఇప్పటివరకు మీరు చేసిన తొమ్మిది చిత్రాల తర్వాత యాక్టర్‌గా మీలో మీరు గుర్తించిన పాజిటివ్స్‌ అండ్‌ నెగెటివ్స్‌?

నెగెటివ్స్‌ అంటే… ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫాన్స్‌ చెప్పినదానిని బట్టి డాన్స్‌లో ఇంప్రూవ్‌లో అవ్వాలి. చాలా మంది ఇదే నా వీక్‌నెస్‌ అని ఎక్స్‌ప్రెస్‌ చేసారు. దాని మీద వర్క్‌ చేయాలి. పాజిటివ్‌ ఏంటంటే… యాక్టింగ్‌ రియలిస్టిక్‌గా ఉంటుందని ఎక్కువ మంది కాంప్లిమెంట్‌ ఇచ్చారు. 

watch full video interview of Naga Chaitanya

ఒక ప్రాజెక్ట్‌ ఓకే చేయడంలో మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంటుంది? 

మొదట్లో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ తగ్గిపోతుంది. ‘‘నాగార్జున కొడుకు నాగచైతన్య అని పేరు రాకూడదు. నీకంటూ ఒక బ్రాండ్‌ రావాలి. అది నీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటేనే జరుగుతుంది. సక్సెస్‌ అయినా ఫెయిల్‌ అయినా కానీ నీకు కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పుడు ఎటెంప్ట్‌ చేయాలి’ అని నాన్నగారు చెప్తారు. ప్రతి సినిమాకీ ఆయనకి అయితే కథ చెప్తారు. కానీ తన డెసిషన్‌పై డిపెండ్‌ అవ్వవద్దని అంటారు. ‘‘నాకు నచ్చవచ్చు… నచ్చకపోవచ్చు. నా జడ్జ్‌మెంట్‌ కూడా రాంగ్‌ అవ్వవచ్చు, ఎవరికి తెలుసు. నీకు నచ్చితే గో ఎహెడ్‌’’ అంటారు. 

సినిమా కంప్లీట్‌ అయిన తర్వాత నాగార్జున ఏమైనా ఛేంజెస్‌ చేస్తుంటారా?

ఈ సినిమా వరకు ఫస్ట్‌ కాపీ వచ్చిన తర్వాత నాన్నగారికి చూపించాం. ఆయన రెండు మైనర్‌ మిస్టేక్స్‌ ఐడెంటిఫై చేసారు. వాటిని వెంటనే కరెక్ట్‌ చేసాం. ఫైనల్‌ ప్రోడక్ట్‌తో అందరం హ్యాపీగా ఉన్నాం. ఇన్‌ఫ్యాక్ట్‌.. సినిమా రిలీజ్‌కి పదిహేను రోజుల ముందే ఫస్ట్‌ కాపీ రెడీ అయిపోయింది. 

‘ఒక లైలా కోసం’ యాక్సెప్ట్‌ చేయడానికి మిమ్మల్ని ఎక్సయిట్‌ చేసిన ఎలిమెంట్స్‌ ఏంటి?

‘తడాఖా’, ‘ఆటోనగర్‌ సూర్య’ తర్వాత ఒక కంప్లీట్‌ లవ్‌స్టోరీ ఎటెంప్ట్‌ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో విజయ్‌కుమార్‌ కొండా కలిసారు. ఆయన తీసిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చూసాను. ఆయన తీసిన విధానం బాగా నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆయన స్ట్రెంగ్త్‌. ‘ఒక లైలా కోసం’ కథలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా ఉంది. రియాలిటీకి దగ్గరగా ఉంది. ఆ రెండు ఎలిమెంట్స్‌ నచ్చి మూవీ ఓకే చేసాను. 

ఇష్క్‌ తర్వాత విక్రమ్‌కుమార్‌తో మనం, గుండెజారి.. తర్వాత విజయ్‌కుమార్‌తో ఒక లైలా కోసం.. స్వామి రారా తర్వాత సుధీర్‌వర్మతో చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌ని ఛేజ్‌ చేస్తున్నారా. అలా సెట్‌ అయిపోయిందా?

(నవ్వుతూ) ఛేజ్‌ అనేది ఏమీ లేదండీ. డైరెక్టర్‌కి ప్రీవియస్‌ ఫిలిం హిట్టున్నా, ఫ్లాప్‌ అయినా డజ్‌ నాట్‌ మేటర్‌. లాస్ట్‌ ఫిలిం ఎలా పర్‌ఫార్మ్‌ చేసింది అనేది పట్టించుకోను. అఫ్‌కోర్స్‌.. హిట్‌ అయితే డెఫినెట్‌గా ప్రొడ్యూసర్‌కి, ఓపెనింగ్స్‌కి అదొక బోనస్‌. కానీ అది కాకుండా నేను ప్రధానంగా కంటెంట్‌ చూసుకుంటానండీ. వాళ్లిప్పుడు నెరేట్‌ చేస్తున్న స్టోరీ గురించి మాత్రమే పట్టించుకుంటాను. అనుకోకుండా వరుసగా ముగ్గురు హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్స్‌తో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలా అని ఒక డైరెక్టర్‌కి ప్రీవియస్‌ ఫిలిం ఫ్లాప్‌ అయిందంటే వాళ్లతో చేయకూడదనేది నాకు లేదు. ఆ మాటకొస్తే నాకు కూడా ఫ్లాప్స్‌ ఉన్నాయి. అయినా కానీ డైరెక్టర్స్‌ నాతో సినిమాలు తీస్తున్నారు కదా. సో హిట్‌, ఫ్లాప్‌ అనేది మేటర్‌ కాకూడదు. 

watch full video interview of Naga Chaitanya

సుధీర్‌ వర్మతో చేస్తున్న సినిమా ఎలా ఉంటుంది?

అది ఒక రొమాంటిక్‌ కాన్‌ ఎంటర్‌టైనర్‌. ఇంతవరకు నేనెప్పుడు కాన్‌ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌ ఎటెంప్ట్‌ చేయలేదు. ఫుల్‌ ఫన్‌ ఉంటుంది. టిపికల్‌ సుధీర్‌ వర్మ స్టయిల్లో ఉంటుంది. సుధీర్‌కి క్వెంటిన్‌ టరంటీనో, గై రిచీ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ ఇష్టం. ఆ స్టయిల్‌లోనే ఉంటుంది ఈ మూవీ కూడా. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌ కూడా బాగా బ్లెండ్‌ చేసాడు. 

మిగిలిన హీరోస్‌తో మీకెలాంటి రిలేషన్‌ ఉంది?

అందరితో మంచి రిలేషన్స్‌ ఉన్నాయి. 

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా?

ఇండస్ట్రీలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రాణాయే. అందరితో పరిచయం ఉంది. కాకపోతే నేనంత సోషల్‌ పర్సన్‌ కాదు. ఎక్కువ బయట కనిపించను.

ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు?

మూవీస్‌, రెస్టారెంట్స్‌.. అంతే. 

మీ బ్రదర్‌ అఖిల్‌ త్వరలో హీరోగా పరిచయం అవుతున్నాడు. తను మీకు కాంపిటీటర్‌ అవుతాడని అనుకుంటున్నారా?

డెఫినెట్‌గా అవుతాడండీ. కాంపిటీషన్‌ అంతా మా ఇంట్లోనే ఉంది. నాన్న ఒకవైపు.. అఖిల్‌ ఒకవైపు. అఖిల్‌ చాలా హార్డ్‌ వర్కింగ్‌. చాలా కష్టపడి అన్నీ నేర్చుకుంటున్నాడు. డెఫినెట్‌గా కాంపిటీషన్‌ ఉంటుంది.. బట్‌ హెల్దీ కాంపిటీషన్‌.  

గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

watch full video interview of Naga Chaitanya