ఫైనల్‌కు చేరిన చెన్నై.. ఫైనల్ బెర్తు కోసం మూడు జట్లు పోటీ!

క్యాలిఫ‌య‌ర్-1 మ్యాచులో గుజ‌రాత్ పై చెన్నై 15 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్ కు చేరింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ చేధించ‌లేక 157…

క్యాలిఫ‌య‌ర్-1 మ్యాచులో గుజ‌రాత్ పై చెన్నై 15 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్ కు చేరింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ చేధించ‌లేక 157 ర‌న్స్ కు ఆలౌటైంది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది. ఫైనల్ బెర్తు కోసం ముంబయి, లక్నో మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో తలపడనుంది. 

కాగా ఐపీఎల్ చరిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఫైన‌ల్ కు చేరిన జ‌ట్టుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. మొత్తం 14 సీజ‌న్ల‌లో 10 సార్లు ఫైన‌ల్ వెళ్ల‌గా నాలుగు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈసారి చెన్నైపై ఏ జట్టు ఫైనల్ ఆడనుందో అనేదానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధోని ఈ ఐపీఎల్ త‌ర్వాత‌ రిటైర్‌ అవుతార‌నే వార్త‌ల నేప‌థ్యంలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సీఎస్‌కే ఎలాగైనా ఈసారి టైటిల్‌ కొట్టి ధోనికి గిఫ్ట్‌గా అందించాలని భావిస్తోంది. రిటైర్మెంట్‌ గురించి ధోని మాట్లాడుతూ.. వ‌చ్చే ఐపీఎల్ లో ఆడ‌తానో లేదో ఇప్పుడు ఎందుక‌ని.. దానికి టైం ఉంద‌ని ఆడాలో లేదో అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటాన‌ని.. ఆడిన ఆడ‌క‌పోయిన సీఎస్‌కేతోనే ఉంటనంటూ చెప్పుకొచ్చారు.