రాజకీయాలకి గుడ్ బై చెప్పిన అలీ!

వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ చెందిన ముఖ్య నాయకులు కొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్తుంటే మరికొందరు సైలెంట్ మూడ్‌లో ఉంటున్నారు. తాజాగా సినీ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీకి…

వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ చెందిన ముఖ్య నాయకులు కొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్తుంటే మరికొందరు సైలెంట్ మూడ్‌లో ఉంటున్నారు. తాజాగా సినీ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఇంక రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో విడుద‌ల చేశారు.

అలీ మాట్లాడుతూ.. 1999లో రామానాయుడి కోసం రాజ‌కీయాల్లో అడుగుపెట్టనని.. ఆ స‌మ‌యంలో రామానాయుడు బాప‌ట్ల ఎంపీగా నిల‌బ‌డుతున్నాన‌ని చెప్పాడ‌ని, వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని అన్నారు. దాదాపు 20 ఏళ్లు ఆ పార్టీలో ఉన్నాన‌ని, ఆ త‌ర‌వాత వైసీపీలో చేరిన‌ట్లు తెలిపారు. తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని.. 45 ఏళ్లుగా ఆరు భాషలు, 1200 పైచిలుకు సినిమాల్లో నటించానన్నారు. త‌న‌కు ఎంతో కొంత భగవంతుడు దయా గుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలంతోడైతే ఇంకా సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదన్నారు.

ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదని.. ఇప్పుడు త‌ను ఏ పార్టీలోనూ లేను.. ఏ పార్టీ సపోర్టర్ ను కాను. ఇక‌ మీదట నా సినిమాలు, నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వ‌చ్చాను అంటూ అలీ మాట్లాడారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప‌నిచేసిన అలీ.. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆయ‌న టికెట్ కేటాయించలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలోనూ అలీ పాల్గొనలేదు. ఇప్పుడు పార్టీ స‌భ్య‌త్వానికి చేశారు.

15 Replies to “రాజకీయాలకి గుడ్ బై చెప్పిన అలీ!”

  1. ఎంట్రొయ్ అన్న ఒడిపొతానె నువ్వు నీ Website UI Layout మార్చావు

    ఎరా అలి నువ్వు trust పెట్టావ్ సరె …..ఎంతమంది రా లబ్ది పొంది వుండెధి

    అ మొహన్ బాబు 25 % ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని దొబ్బుతుంటాడు

    ఒక రుపాయి దానం చెసి వంద రుపాయలు దొబ్బెసె రకం రా మీరు

  2. నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు నట్టేట ముంచి పోయేవాడిని ఏమనాలి..

  3. అయ్యగారు సలహాదారుగా ఎంత శాలరీ తీసుకున్నారు?దానికి అంత న్యాయం చేశారు?

    ఇంతకీ ఏమైనా సలహాలు ఇచ్చారా??

Comments are closed.