కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా.. ఆపై రాజ్యసభ సభ్యునిగా సైతం కొనసాగారు. ఆ తరువాత బీఆర్ఎస్ దూరంగా ఉంటూ.. అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. డీఎస్ మృతిపై కుమారుడు ధర్మపురి అర్వింద్.. నా తండ్రి, గురువు అన్నీ నాన్నే, భయపడకుండా పోరాడాలని నేర్పింది నాన్నే, ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారు అంటూ ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.
6k per sqyd at shadnager kondurg near RRR
For below details 6303134248