కవితక్క వెనక్కుతగ్గడం వెనక కథా కమామీషూ!

గులాబీ తనయ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో తాను వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. బుధవారం ఆ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా.. మంగళవారం నాడు ఆమె…

గులాబీ తనయ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో తాను వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. బుధవారం ఆ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా.. మంగళవారం నాడు ఆమె న్యాయవాదులు పిటిషన్ వెనక్కు తీసుకుంటున్నట్టుగా న్యాయమూర్తికి తెలియజేయడం విశేషం.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన నిందితురాలిగా అరెస్టు అయిన నాటి నుంచి ఏదో ఒక చిన్న చిన్న కారణాలు కూడా విడిచిపెట్టకుండా పదేపదే బెయిలు పిటిషన్లు వేస్తూ.. తిరస్కరణకు గురవుతూ వస్తున్న కవిత తరఫున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకున్నట్టు? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇందుకు సంబంధించి.. రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.

పిటిషన్ వల్ల ఉపయోగం లేదని, ఖచ్చితంగా తిరస్కరణకు గురవుతుందని న్యాయనిపుణులు సూచించినందువల్లనే కవిత దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె సీబీఐ సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదు గనుక డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ జులై 6వ తేదీన పిటిషన్ వేశారు.

అయితే 22 వ తేదీన సీబీఐ చార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ కాపీలు కవిత న్యాయవాదులకు కూడా అందించారు. ఈ నేపథ్యంలో ఆమె పిటిషన్ సోమవారమే కోర్టు ఎదుటకు వచ్చింది. అయితే న్యాయవాదులు ఎటెండ్ కాలేదు. దీంతో బుధవారానికి వాయిదా వేశారు. చార్జిషీట్ దాఖలు అయిపోయినందున.. ఇప్పుడు పిటిషన్ నడిపినా సరే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో వెనక్కు తీసుకున్నారని అంటున్నారు.

అదే సమయంలో.. కవిత కేసు విషయంలో ఆమె అన్నయ్య కల్వకుంట్ల తారక రామారావుతో పాటు, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే తిష్టవేసి ప్రముఖ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. కవితను బయటకు తీసుకురావడం గురించి సంప్రదిస్తున్నారు. వారు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వృథా అని చెప్పి.. వేరే మార్గాలు ప్రయత్నించవచ్చునని చెప్పినందునే ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.

హరీష్, కేటీఆర్ లు తిహార్ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు. బెయిలు ప్రయత్నాల గురించి ఆమెకు వివరించారు. కవిత బెయిలు కోసం ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఈ నాయకులు మీడియాతో మాత్రం.. ఎమ్మెల్యేల అనర్హత గురించి న్యాయకోవిదులతో చర్చిస్తున్నాం అంటూ చెప్పుకోవడం తమాషా!

7 Replies to “కవితక్క వెనక్కుతగ్గడం వెనక కథా కమామీషూ!”

  1. వాషింగ్ మెషిన్ పార్టీ ప్రాపకం కోసం ఎదురు చూపులు. ఇంకా డీల్ సెట్ అవ్వలేదు.

  2. ఢిల్లీ ఎన్నికల తరువాత విలీనం. విలీనం తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కు దక్కనున్న పదవుల మీద చర్చ

  3. అవసరమా? తెలంగాణ ప్రజలు చూపిన అభినాము ఈ కుటుంబానికి, గర్వంగా గౌరవముగా జీవించాల్సింది పోయి…అత్యాశ.

Comments are closed.