ఆయ‌న ముసుగు తొల‌గిందంటున్న వైసీపీ!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు వైసీపీకి ఇవాళ రాజీనామా చేయ‌నున్నారు. జ‌న‌సేన‌లో చేర‌నున్నారు. అయితే దొర‌బాబు దూరం కావ‌డం వ‌ల్ల వైసీపీకి ఎలాంటి న‌ష్టం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. 2019లో…

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు వైసీపీకి ఇవాళ రాజీనామా చేయ‌నున్నారు. జ‌న‌సేన‌లో చేర‌నున్నారు. అయితే దొర‌బాబు దూరం కావ‌డం వ‌ల్ల వైసీపీకి ఎలాంటి న‌ష్టం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. 2019లో వైసీపీ త‌ర‌పున పిఠాపురం నుంచి దొర‌బాబు గెలుపొందారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు.

పిఠాపురం నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌రిలో నిలుస్తార‌ని తెలియ‌డంతో ఆయ‌న‌పై వంగా గీత‌ను నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో దొర‌బాబు మ‌న‌స్తాపం చెందారు. దొర‌బాబును జ‌గ‌న్ పిలిపించుకుని బుజ్జ‌గించారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో వైసీపీలోనే కొన‌సాగారు. కానీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆయ‌న వెన్నుపోటు పొడిచిన‌ట్టు స్థానిక నాయ‌కులు అప్ప‌ట్లోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

త‌న వాళ్లంద‌రినీ జ‌న‌సేన‌లోకి పంపి, దొర‌బాబు మాత్రం వైసీపీలో వుంటూ ప‌వన్‌కు పరోక్ష మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు పిఠాపురం వైసీపీ నాయకుల వాద‌న‌. ఇప్పుడు వైసీపీకి రాజీనామాతో ఆయ‌న ముసుగు తొల‌గింద‌ని వాళ్లు చెబుతున్నారు. పిఠాపురంలో దొర‌బాబుకు సొంత బ‌లం అంటూ లేద‌ని చెబుతున్నారు.

వంగా గీత గెలిస్తే శాశ్వ‌తంగా త‌న‌కు రాజ‌కీయ స‌మాధి త‌ప్ప‌ద‌నే భ‌యంతో దొర‌బాబు నాట‌కాలు ఆడార‌ని, ఇప్పుడు అభివృద్ధి కోసం జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని త‌ప్పు ప‌డుతున్నారు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డే దొర‌బాబు పార్టీని వీడ‌డం వ‌ల్ల వైసీపీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

9 Replies to “ఆయ‌న ముసుగు తొల‌గిందంటున్న వైసీపీ!”

  1. ఎం రాత నాయన ? బలం లేదు అంటావ్ , తన వాళ్ళందరిని జనసేన లోకి పంపాడు అంటావ్ అసలు బలం లేకపోతే ఎలా పంపుతాడు జనసేన లోకి?

  2. అందరి ముసుగులు తొలగుతాయి, చివరికి విసా రెడ్డి ముసుగు కూడా

  3. చేసారులే మొదటిలో ఒకపక్క లవంగం అన్న ఇంకోపక్క సవంగం అన్నను పెట్టుకొని పెరుగన్నంలో లవణం వెస్కొని తాడేపల్లిలో సవరం వెస్కొని నిద్రపోయిన పులివెందుల పిల్లి … అంతేగా కొకైన్

Comments are closed.