పుష్ప 2 అప్ డేట్స్ ఇవే!

బన్నీ- సుకుమార్- మైత్రీ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఆగస్ట్ 15 కు విడుదల కావాల్సి వుంది. కానీ డిసెంబర్ కు వాయిదా పడింది. వర్క్ పూర్తి కాకపోవడమే కారణం…

బన్నీ- సుకుమార్- మైత్రీ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఆగస్ట్ 15 కు విడుదల కావాల్సి వుంది. కానీ డిసెంబర్ కు వాయిదా పడింది. వర్క్ పూర్తి కాకపోవడమే కారణం తప్ప మరేమీ కాదు.

ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ఈ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెలాఖరు వరకు ఓ షెడ్యూలు వుంటుంది. ఈ షెడ్యూలు అంతా హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారు.

ఆగస్ట్ చివరకు దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా టైమ్ మిగులుతుంది. దాదాపు మూడు నెలల పాటు పోస్ట్ ప్రోడక్షన్ చేసుకోవచ్చు. డిసెంబర్ లో అనుకున్న డేట్ కు హ్యాపీగా రావచ్చు.

పుష్ప సినిమాకు మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు పుష్ప 2 కు మంచి క్రేజ్ ఆటో మెటిక్ గా వచ్చింది. ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఇది ఒకటి. దాదాపు రెండేళ్లకు పైగా సెట్ మీద వుందీ సినిమా. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసారు. అవి జనంలోకి బాగానే వెళ్లాయి. మిగిలిన పాటలు కూడా రావాల్సి వుంది.