Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అడ్వాన్స్ వెనక్కు ఇచ్చిన ఇంద్రగంటి

అడ్వాన్స్ వెనక్కు ఇచ్చిన ఇంద్రగంటి

సినిమా రంగంలో తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వడం అనేది కాస్త తక్కువే. అయితే సినిమా చేస్తారు. లేదా నాన్చుతారు. కొందరు మాత్రమే ఎక్కడిక్కడ సెటిల్ చేసుకుంటారు. కొందరు ఎలాగైనా వసూలు చేసుకుంటూ వుంటారు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు వెనక్కు ఇస్తారు. బోయపాటి లాంటి వాళ్లు సినిమా చేయడానికి ఇస్తా..చేస్తా..అంటారు. 

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, దర్శకుడు ఇంద్రగంటి ఎప్పుడో జమానా కాలంలో తీసుకున్న అడ్వాన్స్ ఇప్పుడు వెనక్కు ఇచ్చారు. నిర్మాత సాయి కొర్రపాటి నుంచి ఇంద్రగంటికి ఎప్పుడో ఏళ్ల క్రితం అడ్వాన్స్ అందింది. నాగ్ చైతన్యతో సినిమా కోసం. కానీ అది అప్పట్లో ఎందుకో రెండు మూడు సార్లు ట్రయ్ చేసినా సెట్ కాలేదు. 

ఈలోగా ఇంద్రగంటి వేరే వాళ్లకు చకచకా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర రెండు మూడు అడ్వాన్స్ లు వున్నాయి. మైత్రీ మూవీస్ కు బదులుగా ఒప్పుకున్న సినిమా ఒకటి దిల్ రాజకు చేయాలి. అలాగే చైతన్య హీరోగా సాహో గారపాటికి ఓ సినిమా చేయాలి. ఇలా కమిట్ లు వున్నాయి. అందుకే ఇక ఇప్పట్లో సాయి కొర్రపాటితో సినిమా చేయలేను అని డిసైడ్ అయినట్లున్నారు. అప్పట్లో తీసుకున్న అడ్వాన్స్ ను ఇటీవల తిరిగి ఇచ్చేసారు.

వి సినిమాను ఓటిటిలో విడుదల చేయడానికి ముందు నిర్మాత దిల్ రాజు డైరక్టర్ ఇంద్రగంటి పారితోషికం అక్కౌంట్ సెటిల్ చేసినట్లు బోగట్టా. ఆ మొత్తంలోంచి సాయి కొర్రపాటికి ఇవ్వాల్సింది ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించుకుంటున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?