Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అలీ రాజకీయం: జనసేన కాదా.? టీడీపీనా.?

అలీ రాజకీయం: జనసేన కాదా.? టీడీపీనా.?

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కమెడియన్‌ అలీ చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం విదితమే. 2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుకున్న అలీ, ఈ మేరకు విశ్వ ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు. ఓ దశలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నుంచి కూడా, టీడీపీపై ఒత్తిడి చేయించాడట అలీ. అయినాసరే, అలీ విషయంలో చంద్రబాబు అంత సానుకూలత వ్యక్తం చేయలేదు. 

రాజకీయ ఆలోచనలతోనే అప్పట్లో అలీ రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసేశాడు. అఫ్‌కోర్స్‌, అవి అంతకు ముందు తక్కువగానే జరిగినా, ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయనుకోండి.. అది వేరే విషయం. ఈసారి ఎలాగైనా, టిక్కెట్‌ సంపాదించాలనే ఆలోచనలతో వున్న అలీకి, టీడీపీ నుంచి తీపి కబురు అందిందనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల నాటికి టీడీపీ నుంచి అలీకి టిక్కెట్‌ దాదాపు ఖాయమయ్యిందట. అయితే అలీ కోరుకుంటున్న రాజమండ్రి నుంచేనా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

అయితే, అలీ - పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. ఈ విషయాన్ని ఇటు అలీ, అటు పవన్‌ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. మరి, ఎక్కడ తేడా కొట్టేసింది.? పవన్‌కళ్యాణ్‌కి అలీ ఈ రకంగా దూరమయినట్లేనా.? 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని పోటీలోకి దింపుతోన్న పవన్‌కళ్యాణ్‌, ఆ ఎన్నికల సమయంలో అలీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదా.? ఏమోగానీ, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటిదాకా చిరంజీవికి సినీ రంగంలో అత్యంత సన్నిహితులుగా వున్నవారే, చిరంజీవి రాజకీయాల్లోకొచ్చాక ఆయనపై విమర్శలు చేసేశారు. సో, అలీ నుంచి పవన్‌పై పొలిటికల్‌ విమర్శలు రాకుండా వుండవని అనుకోలేం. 

ఇదిలా వుంటే, అలీ జనసేనకు దగ్గరవుతాడనే ఆలోచనతోనే ముందస్తుగా టీడీపీ అధినేత చంద్రబాబు, అలీని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారనీ, అలీ వైపు నుంచి పూర్తి క్లారిటీ ఇంకా లేదనీ మరో గాసిప్‌ కూడా విన్పిస్తోంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. పవన్‌కి యాంటీ కేటగిరీలో అలీకి చంద్రబాబు సీటిస్తారా.? లేదంటే, అలీ - జనసేన నుంచి బరిలోకి దిగుతారో.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?