కోన లేకుండా వస్తేనే…?

బాబీ..గోపీ మోహన్, శ్రీవాస్ అంటే ఆ వెంటనే కోన వెంకట్ పేరు కూడా గుర్తుకువస్తుంది. కానీ ఇప్పుడు వీరంతా విడివిడిగా ట్రయ్ చేసుకోవాల్సి వస్తోందట. కోన వెంకట్ తో కలిపి అంటే మాత్రం హీరోలు…

బాబీ..గోపీ మోహన్, శ్రీవాస్ అంటే ఆ వెంటనే కోన వెంకట్ పేరు కూడా గుర్తుకువస్తుంది. కానీ ఇప్పుడు వీరంతా విడివిడిగా ట్రయ్ చేసుకోవాల్సి వస్తోందట. కోన వెంకట్ తో కలిపి అంటే మాత్రం హీరోలు మొహం చాటేస్తున్నారని వినికిడి.

ఎన్టీఆర్ ఆల్రెడీ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ వినే ముందే చెప్పాడట, కోన వెంకట్ స్కూలు టైపు కథ అయితే వినేది లేదని. అలా కాదని, ఇది పూర్తిగా డిఫరెంట్ గా వుంటుందని, కోన కథల ఛాయలు వుండవని బాబీ ముందే మాట ఇచ్చాడట. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా బాబి సినిమా వుండే అవకాశం వుందట. అక్కడా ఇదే కండిషన్ అని వినికిడి. 

శంకరాభరణం లగాయతు, అభినేత్రి మీదుగా, సాహసం శ్వాసగా సాగిపో వరకు కోన వెంకట్ కు అన్నీ డిజాస్టర్లే. పైగా ఇటీవల నాని ప్రాజెక్టు విషయంలో కాంట్రావర్సీ కూడా చెలరేగింది. ఈ విషయంలో ఓ సినిమా సెలబ్రిటీ కోన సన్నిహితుడికి ఫోన్ చేసి కాస్త గట్టి హెచ్చరిక కూడా చేసినట్లు తెలుస్తోంది.

దీంతో సినిమా జనాలు కోన అంటే కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అందుకే కోన వెంకట్ ప్రస్తుతం అమెరికాలో వుండి ఎన్నారై ప్రొడ్యూసర్లను సంపాదించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్లు దొరుకుతారు సరే, కానీ హీరోలు ఎవరు వస్తారో?