చిన్న సినిమాపై అరవింద్ చూపు

పెద్ద సినిమాలు అల్లు అరవింద్ కు మొహం మొత్తాయట. చిన్న చిన్న సినిమాలే బెటర్ అని డిసైడ్ అయిపోయాడట. బ్యానర్ వాల్యూ, థియేటర్ నెట్ వర్క్ వాడి, చిన్న సినిమాలు తీసి, సినిమాకు కోటి…

పెద్ద సినిమాలు అల్లు అరవింద్ కు మొహం మొత్తాయట. చిన్న చిన్న సినిమాలే బెటర్ అని డిసైడ్ అయిపోయాడట. బ్యానర్ వాల్యూ, థియేటర్ నెట్ వర్క్ వాడి, చిన్న సినిమాలు తీసి, సినిమాకు కోటి రూపాయిలు మిగుల్చుకున్నా మంచిదే అని అనుకుంటున్నాడట. 

అయితే అంత పెద్ద ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు తీయడం ఏమిటని అంటారని, కొత్త పద్దతి ఒకటి కనిపెట్టాడు. అదే పర్సంటేజ్  పద్దతిపై సినిమాలు తీయించడం. బన్నీ వాసు ను నిర్మాతగా ముందుపెట్టి, తాను పెట్టుబడి పెట్టి రెండు సినిమాలు, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం ప్రారంభించేసాడు. సినిమాకు ఇంత అని బన్నీవాసుకు పర్సంటేజి ఏర్పాటు చేసుకున్నట్ల బోగట్టా. ఏమైతేనేం కాస్త మంచి చిన్న సినిమాలు వస్తే మంచిదే.​