చక్రి మరణం అనుమానాస్పదంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. చక్రి భార్య, చక్రి కుటుంబ సభ్యులు చక్రి మరణంపై పరస్పర ఆరోపణలు చేసుకుంటోన్న నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. చక్రి ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం విదితమే.
అర్థరాత్రి లేటుగా చక్రి నిద్రపోగా, ఉదయాన్నే మేల్కొలపడానికి ప్రయత్నించిన శ్రావణి భార్యకు అనుమానం వచ్చి, ఆసుపత్రికి తరలించింది. అప్పటికే చక్రి మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే డాక్టర్లు చక్రి మరణాన్ని ‘సస్పీషియస్ డెత్’గా అభివర్ణించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల (కుటుంబ సభ్యుల సూచనల, సినీ పెద్దల సూచనల మేరకు) అప్పట్లో చక్రి మరణం వివాదాస్పదం కాలేదు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చక్రి మరణంపై అనుమానాలు పెరిగిపోయాయి. చక్రిని ఎవరు చంపారు? అననదానికి సంబంధించి చక్రి భార్య, చక్రి కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదైన దరిమిలా, అసలు వాస్తవమేంటో విచారణలో తేలాల్సి వుందన్నమాట. అయితే చక్రి భౌతిక కాయానికి దహన సంస్కారాలు జరిగిపోవడంతో, చక్రి డెత్ మిస్టరీ ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కన్పించడంలేదు.