ఇష్టమైన అతివ కోసం ఎన్ని కష్టాలైనా పడతారు మగాళ్ళు. కంచెలు దూకుతారు. కాలువలు ఈదుతారు. గోడలు దూకుతారు. అమ్మాయిలలోని ఆకర్షణ అలాంటిది. మరి శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కోసం బాలీవుడ్ వస్తాదు సల్మాన్‌ఖాన్ కూడా సముద్రం దాటి లంక వెళ్ళాడా? అంటే ఒప్పుకోక తప్పదు మరి.
‘కిక్’ సినిమాలో జాక్వెలైన్‌తో తెరబంధం పెంచుకున్న సల్మాన్‌ఖాన్ తనకు నచ్చిన అమ్మాయి కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడడు. అయితే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ మాత్రం ఆయన వచ్చింది నేను నిర్వహించిన నేత్ర చికిత్సా శిబిరానికి మాత్రమేనని అబద్ధాలు చెప్పేస్తోంది.
పైగా శ్రీలంక ఎన్నికల్లో రాజపక్సేని గెలిపించడానికి జాక్వెలైన్ తెలివిగా తన కోస్టార్ సల్మాన్‌ఖాన్‌ని రప్పించిందనేదీ వాస్తవమే. ఈ రెండు విషయాల్లోనూ క్లారిటీ ఇవ్వకుండా జాక్వెలైన్ తెలివిగా తప్పించుకోవాలని చూస్తుందట.
నేత్ర శిబిరానికి ఆమెనొక్కదాన్నే ఆహ్వానించారట ఆ సంస్థ వాళ్ళు. మరి పిలవని పేరంటానికి సల్మాన్‌ఖాన్ ఎందుకు వెళతాడు.? చూస్తుంటే జాక్వెలైన్ తన ముదురు తెలివితేటలతో జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడంలేదూ.!