Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్కా.. ఎవరా హీరో.. ఏమా కథ.?

అనుష్కా.. ఎవరా హీరో.. ఏమా కథ.?

బాలీవుడ్‌ అనుష్క శర్మ ఇటీవలి కాలంలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలోనే, అతి తక్కువ సినిమాలతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న అనుష్క శర్మ, కేవలం నటిగానే మిగిలిపోవాలనుకోవడంలేదు.. ఆమెకు సినీ నిర్మాణంపై అమితాసక్తి వుంది. ఆ ఇష్టంతోనే, ఇప్పటికే 'ఎన్‌హెచ్‌ 10' అనే సినిమాని నిర్మించింది. మరో సినిమాని నిర్మిస్తోంది కూడా. 'ఫిల్లౌరి' పేరుతో రూపొందుతోన్న ఆ సినిమా మార్చ్‌లో విడుదల కానుంది. 

ఇదిలా వుంటే, అనుష్క నిర్మాతగా ఓ భారీ బడ్జెట్‌ సినిమా అతి త్వరలో సెట్స్‌ మీదకు రానుందట. బాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో అనుష్క నటించదట. కేవలం నిర్మాణ బాధ్యతల్ని మాత్రమే చూసుకుంటుందట. చిత్ర నిర్మాణంలో సదరు హీరో కూడా భాగం పంచుకుంటాడనే ప్రచారం జరుగుతోంది. 

నిర్మాతగా అనుష్క ఆలోచనలు విభిన్నంగా వుంటాయి. 'ఎన్‌హెచ్‌10' సినిమానే అందుకు నిదర్శనం. త్వరలో తెరకెక్కించనున్న భారీ చిత్రం కూడా ఆ కోవలోనే విభిన్న కథాంశంతో రూపొందనుందట. ఆ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 'ఫిల్లౌరి' విడుదల తర్వాత అధికారికంగా ఆ ప్రాజెక్ట్‌పై అనుష్క ప్రకటకటన చేయనుందనీ, బాలీవుడ్‌లో రూపొందినా, దేశంలోని పలు భాషల్లో ఆ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటోందనీ తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?