బాలీవుడ్‌లో ఇలియానా హవా బాగానే నడుస్తోంది. సినిమా అవకాశాల సంగతెలా వున్నా, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఇలియానా మారిపోవడం, బాలీవుడ్ పార్టీ కల్చర్‌లో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తుండడం ఇవన్నీ ఆమెకు బాగానే కలిసొస్తున్నాయి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తోనూ, వీలు చిక్కినప్పుడల్లా బికినీ వీడియోలతోనూ సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తోంది ఇలియానా.
ఇక, తాజాగా ఇలియానా 'ముబారకన్' సినిమాలో అర్జున్ కపూర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ కపూర్‌ని 'క్లీన్ బౌల్డ్' చేసేసిందట ఇలియానా. ఇలియానా చాలా 'ఫన్ గాళ్' అంటూ అర్జున్ కపూర్ కితాబులిచ్చేస్తున్నాడు. ఇలియానాతో మాట్లాడుతోంటే అసలు టైమ్ ఎలా గడిచిపోతోందో అర్జున్ కపూర్‌కి తెలియడంలేదట. తమ మధ్య ఏర్పడ్డ ఈ ఫ్రెండ్షిప్ కారణంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా వస్తుందని చెబుతున్నాడు అర్జున్ కపూర్.
మరోపక్క, అర్జున్ కపూర్ హ్యాండ్సమ్ గై మాత్రమే కాదు, చాలా రొమాంటిక్.. అంటోంది ఇలియానా. ఇప్పటిదాకా చాలామందితో కలిసి వర్క్ చేశానుగానీ, అర్జున్ కపూర్‌లా హ్యూమర్ ఉన్న రొమాంటిక్ గై తనకెప్పుడూ ఎదురవలేదని ఇలియానా చెబుతోంది. అటు అర్జున్ కపూర్ ఇటు ఇలియానా.. ఒకర్ని ఒకరు 'రొమాంటిక్, ఫన్..' అంటోంటే బాలీవుడ్ సినీ జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.