పెళ్లిచూపులు విజయంతో దేవరకొండ విజయ్ సాయికి ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ రాలేదు కానీ 'అర్జున్ రెడ్డి' అతనికి ఒక విలక్షణమైన ఇమేజ్ తెచ్చి పెట్టింది. మిగతా హీరోల నుంచి ఇతడిని సెపరేట్ చేసి చూస్తున్నారు. ఆ ఇమేజ్‌ని పబ్లిక్‌లో కూడా మెయింటైన్ చేస్తూ అలాగే మాట్లాడుతూ యువతని ఇంకా ఇంకా ఆకట్టుకుంటున్నాడు.
అర్జున్ రెడ్డితో విజయ్‌సాయికి యువతలో కల్ట్ ఫాలోయింగ్ వచ్చిందనేది వాస్తవమే కానీ ఇది ముందు ముందు అతడిని ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంతో వచ్చిన ఇమేజ్‌ని విజయ్ అన్ని సినిమాల్లోను కంటిన్యూ చేయలేడు.
అర్జున్‌రెడ్డి లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయే తప్ప రెగ్యులర్‌గా తన వయసు హీరోలు ప్రేమకథలు, ఫ్యామిలీ కథలే చేస్తుండాలి. అలాంటి రొటీన్ సినిమాలు చేస్తే విజయ్ సాయిని ఇదే విధంగా ఆదరిస్తారనేది అనుమానమే.
తననుంచి ఆడియన్స్ ప్రతి సినిమాలోను ప్రత్యేకత ఆశిస్తే అది అందించడానికి విజయ్ సాయి స్ట్రగుల్ అవ్వాలి. అర్జున్ రెడ్డితో వచ్చిన అటెన్షన్, క్రేజ్ బాగా ఎంజాయ్ చేస్తోన్న విజయ్ దీనిని నిలబెట్టుకునేందుకు ఏం చేస్తాడనేది చూడాలి.