ఆటోనగర్ సూర్య సినిమాకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మరో 20 % షూటింగ్ మిగిలి ఉండగా, ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఆమధ్య మళ్లీ ప్రారంభమైంది. రెండు రోజుల షూటింగ్ తరవాత.. పేకప్ చెప్పేశారు. కానీ తిరిగి మొదలవ్వలేదు.
ఈ సినిమాపై ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి రాదనే నిర్ణయానికి వచ్చేసిన నిర్మాతలు ఆటోని ముట్టుకోకపోవడమే మంచిది అనుకొంటున్నారట. అయితే ఈ విషయాన్ని నాగచైతన్య చాలా ప్రెష్టేజియస్ గా తీసుకొన్నాడట. సొంత డబ్బులు పోసి సినిమాని నడిపించాలని అనుకొన్నాడట.
కానీ నాగార్జున వారించడాడట. అది నిర్మాతలు చూసుకోవాల్సిన విషయం… నీకెందుకు..? అని అడ్డు చెప్పాడట. దాంతో – ఆటో మళ్లీ ఆగిపోయింది. నిర్మాతలు మాత్రం ఎప్పుడు డబ్బులంటే అప్పుడు ఈ సినిమా తీస్తాం.. అంటున్నారట. ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో మరి..?