బాలకృష్ణతో ‘లెజెండ్’ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే, బాలకృష్ణతోనే ‘లయన్’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. నటనతో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్న రాధికా ఆప్టే, సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తుంటుంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘హంటర్’ అనే సినిమాలో నటించిన రాధికా ఆప్టేకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే, రాధికా ఆప్టేకి జెలసీ ఫీలవడం, అభద్రతాభావం.. లాంటి ఫీలింగ్స్ చాలా ఎక్కువట. ఎవరన్నా ఓ సినిమాలో మంచి పాత్ర పోషిస్తే, అలాంటి అవకాశం తనకెందుకు దక్కలేదని తెగ ఫీలయిపోతుందట. నచ్చిన పాత్రల్లో నటించడానికి రెమ్యునరేషన్‌ని సైతం లెక్కచేయదట రాధికా ఆప్టే. అదే సమయంలో రాధికా ఆప్టేకి అభద్రతా భావం ఎక్కువట.
జెలసీ, అభద్రతా భావం ఎక్కువే అయినా, మంచి సినిమాలు వచ్చినప్పుడు అందులో నటించిన నటీనటుల్ని అభినందిస్తుందట. అలాంటి పాత్ర తనకూ వస్తే బావుంటుందని అనుకుంటాననీ, అంతే తప్ప, వాళ్ళేదో గొప్పగా చేసేశారనీ కుళ్ళుకోవడం లాంటివి తనకు తెలియదని రాధికా ఆప్టే చెబుతోంది. దాన్నే జెలసీ అంటారు మరి.! రాధికా ఆప్టే మాత్రం జెలసీకి ఇంకేదో అర్థం చెబుతోంది.