తెలుగు జనాలకు నప్పే సరైన ఫైట్ మాస్టర్లు అంటే రామ్ లక్ష్మణ్ నే. కాలానుగుణంగా మారే ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫైట్లు కంపోజ్ చేయడంలో వారు ఫస్ట్ ప్లేస్ లో వుంటూ వస్తున్నారు.
ముఖ్యంగా మాస్ ఫైట్లు కంపోజింగ్ లో వారి తరువాతే ఎవ్వరైనా. ఆ ఇద్దరూ దర్శకుడు బోయపాటి సినిమాకు వర్క్ చేస్తున్నారు. బాలయ్య హీరో. బోయపాటి అంటే యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో వుంటాయి.
ఆయనకు రామ్ లక్ష్మణ్ నే కీలకం. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరూ ఆ సినిమాను వదిలేసినట్లు తెలుస్తోంది. బోయపాటితో వచ్చిన మనస్పర్ధలే ఇందుకు కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బోయపాటి వ్యవహారం నచ్చట, రామ్ లక్ష్మణ్ ఇద్దరూ కామ్ గా తాము ఆ సినిమా చేయలేమని చెప్పి తప్పుకున్నట్లు బోగట్టా. వారి ప్లేస్ లో స్టంట్ శివ జాయిన్ అయినట్లు తెలుస్తోంది.