బాలయ్యతో ముచ్చటగా మూడోసారి

బాలకృష్ణ సరసన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించిన నయనతార ముచ్చటగా మూడోసారి ఆయనతో జంట కట్టబోతోంది. బాలయ్య హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక కథానాయికగా నయనతార ఖరారైందట. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్‌…

బాలకృష్ణ సరసన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించిన నయనతార ముచ్చటగా మూడోసారి ఆయనతో జంట కట్టబోతోంది. బాలయ్య హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక కథానాయికగా నయనతార ఖరారైందట. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్‌ రచయితల ద్వయం కోన, గోపీ మోహన్‌ రచన చేస్తున్నారు. 

‘లౌక్యం’ తర్వాత ఈ దర్శకుడు, ఈ రచయితల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఎప్పుడూ మాస్‌ సినిమాలు చేసే బాలకృష్ణతో ఆయన మార్కు మిస్‌ అవ్వని ఒక వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. బాలకృష్ణ నటించే 99వ చిత్రమిదే కావడం విశేషం. లయన్‌ షూటింగ్‌ పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళుతుంది. 

వందవ చిత్రానికి ఒక్క సినిమా దూరంలో ఉన్న బాలకృష్ణ లెజెండ్‌ ఇచ్చిన విజయాన్ని నిలబెట్టుకుని, సక్సెస్‌ ట్రాక్‌ తప్పకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లయన్‌ సినిమాపై ఇప్పటికే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్నాయి. 99వ సినిమా కూడా మినిమం గ్యారెంటీ కంటెంట్‌ ఉన్న చిత్రాన్నే ఎంచుకున్నాడు. దీనికి తమన్‌ స్వరాలందిస్తున్నాడు.