ఒకప్పుడు ప్రతి సినిమాను సూపర్ హిట్ చేసుకున్న బిగ్ డైరక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. అలాంటి డైరక్టర్ బాలయ్యకు ఇచ్చిన అట్టర్ ఫ్లాప్..టాప్ హీరో. ఆఫ్ కోర్స్ నాగ్ తో రీమేక్ చేసి వజ్రం అనే ఫ్లాప్ కూడా ఇచ్చారు. అది వేరే సంగతి. అయితే ఇప్పుడు బాలయ్య తో కృష్ణారెడ్టి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట నిర్మాత పుప్పాల రమేష్. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర అద్భుతమైన కథ వుందని, దాన్ని బాలయ్యకు వినిపించి, ఆ కాంబినేషన్ ను 101 వ సినిమాగా సెట్ చేయాలనుకుంటున్నారట.
అయితే శాతకర్ణి లాంటి సినిమా చేసిన తరువాత బాలయ్య పోయ పోయి కృష్ణారెడ్డితో సినిమా చేస్తారా అన్నది అనుమానం. కానీ బాలయ్య ఇలాంటి లెక్కలు చూసుకోరు. లెజెండ్ తరువాత లయన్ చేయలేదా? అని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శాతకర్ణి పనుల్లో బిజీగా వున్న బాలయ్యకు కథ చెప్పి ఒప్పించాలని పుప్పాల రమేష్, ఎస్వీ కృష్ణారెడ్డి వేచి వున్నట్లు తెలుస్తోంది. వీరి కోరిక నెరవేరుతుందా? టాప్ హీరో అనుభవాన్ని మరచిపోయి బాలయ్య వీరి ప్రాజెక్టుకు ఊ అంటారా? కొన్నాళ్లు ఆగాలి తెలియాలంటే.