గీతా ఆర్ట్స్ లో మళ్లీ పరశురామ్

సాధారణంగా గీతా ఆర్ట్స్ లో రెండో చాన్స్ రావడం అంటే ఆ డైరక్టర్ కు కాస్త విషయం వుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే. సోలో లాంటి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని అమితంగా ఆకర్షించిన దర్శకుడు పరశురామ్.…

సాధారణంగా గీతా ఆర్ట్స్ లో రెండో చాన్స్ రావడం అంటే ఆ డైరక్టర్ కు కాస్త విషయం వుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే. సోలో లాంటి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని అమితంగా ఆకర్షించిన దర్శకుడు పరశురామ్. దాంతో అల్లు అరవింద్ దగ్గర చాన్స్ సంపాదించేసాడు. ఆ చాన్స్ ను నిలబెట్టుకుని, శ్రీరస్తు-శుభమస్తుతో అల్లు శిరీష్ ను హీరోగా ఓకె అనిపించేసాడు. 

దాంతో అల్లు అరవింద్ మళ్లీ మరో చాన్స్ ఇచ్చేసారు. ఓ యంగ్ హీరోతో గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రకటన బహుశా న్యూ ఇయర్ సందర్భంగా వుండొచ్చు. గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో అంటే బహుశా మళ్లీ అల్లు శిరీష్ లేదా విజయ్ దేవరకొండ కావచ్చు. అల్లు శిరీష్ తన తరవాత సినిమా డైరక్టర్ ఆనంద్ తో చేస్తున్నాడు కాబట్టి, విజయ్ కాంబినేషన్ లోనే పరశురామ్ సినిమా వుంటుందేమో.