జూన్, జులై డల్‌గా గడిచిపోవడంతో సినిమాల రద్దీ మళ్లీ పెరిగింది. ఈవారం అల్లుడు శీనుతో సినిమా సందడి మళ్లీ మొదలు కానుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో చాలా చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం వల్ల లాభపడే వాటికంటే నష్టపోయేవే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని సినిమాలైనా వాయిదా పడతాయని చూస్తున్నారు.
అయితే తమ సినిమాల్ని వాయిదా వేసుకున్నట్టయితే ఆగస్ట్ 14న రాబోతున్న ఎన్టీఆర్ రభస వల్ల నష్టపోవాల్సి వస్తుందని చిన్న నిర్మాతలు భయపడుతున్నారు. రభస సినిమా రిలీజ్ అయితే దాదాపుగా అందుబాటులో ఉన్న థియేటర్లన్నీ ఆక్రమిస్తుంది కనుక ముందు రిలీజ్ అయిన చిన్న సినిమాల్ని తీసేయాల్సి వస్తుంది.
చిన్న చిత్రాలకి అయితే మౌత్ టాక్‌తో కలెక్షన్స్ పెరిగే ఛాన్సుంటుంది. అందుకే వాటికి కాస్త స్పేస్ అవసరం. అలాంటి టైమ్‌లో రభసలాంటి చిత్రం వస్తే ఇక అంతే సంగతులు. దీంతో వెనక్కి వెళ్లడానికి ధైర్యం చాలక ఆగస్ట్ 1న రిలీజ్ చేసుకోవడానికి చాలా మంది కొట్టుకుంటున్నారు.