తండేల్ అధిగమించిన కష్టాలెన్నో!

సెన్సారు నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా తట్టుకుని, సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికీ చాలా ముందుగా సెన్సారు చేయించారు.

కొన్ని సినిమాలు తీయడం కష్టం. మరి కొన్ని సినిమాలు తీయడం, విడుదలకు సెన్సారు చేయించడం కూడా కష్టం. ఈ కోవలోకి వస్తుంది చైతన్య-సాయిపల్లవి ల తండేల్ సినిమా. ఈ సినిమాకు సెన్సారు నుంచి అడ్డం పడిన రూల్స్ రెగ్యులేషన్లు, చెప్పిన కట్ లు ఇన్నీ అన్నీ కాదు. దాదాపు పదమూడు కట్ ల వరకు చెప్పారని తెలుస్తోంది.

సరే కట్ లు చెప్పడం, మ్యూట్ లు చేయించడం మామూలే అనుకుంటే తండేల్ విషయంలో మాత్రం ఇవన్నీ పాటించడం చాలా కష్టమైందని తెలుస్తోంది. సిజి పనులు, వాళ్లు చెప్పిన మ్యూట్ లు, కట్ లు చాలా కీలకమైన సీన్లలోవి కావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే చాలా పర్మిషన్లు తెచ్చి సెన్సారుకు అందించాల్సి వచ్చింది. సినిమా మత్స్యకారుల జీవనం నేపథ్యంలో తీసారు. చాలా లైవ్ పాత్రల రిఫరెన్స్ వుంది. అందులో కొన్ని పొలిటికల్ పాత్రలు కూడా వున్నాయి. అందువల్ల సంబంధీకులు అందరి దగ్గరకు వెళ్లి అనుమతి పత్రాలు తీసుకుని రావాల్సి వచ్చింది.

పాకిస్థాన్ రిఫరెన్స్ ఎక్కువ వుండడం, జాతీయ జెండాలు చూపించడం ఇలా ఒకటి కాదు చాలా వున్నాయి వ్యవహారాలు. దాంతో వాటిని అన్నింటికీ సెన్సారు నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా తట్టుకుని, సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికీ చాలా ముందుగా సెన్సారు చేయించారు. కానీ ఇవన్నీ వర్కవుట్ చేసి, ఫైనల్ కాపీ రెడీ చేయడానికి వన్ వీక్ పైగానే పట్టింది.

4 Replies to “తండేల్ అధిగమించిన కష్టాలెన్నో!”

  1. ఈ పాన్ ఇండియా దరిద్రం నుంచి తెలుగు సినిమాను ఎవరు కాపాడతారో? దిల్ రాజు, అల్లు అరవింద్ కాస్త మంచి సినిమాలు తొందరగా చేస్తారనుకుంటే వీళ్ళకు కూడా ఈ పిచ్చి పట్టింది. ఈ దరిద్రపు పాకిస్థాన్ గురించి మరచి పోవాలనుకుంటారు గానీ, డబ్బులు పెట్టి ఎవరు తలనొప్పి తెచ్చు కుంటారు? కాస్త మంచి తెలుగు వాడతారని ఈ సైటు కు వస్తుంటే వీళ్ళు కూడా తెలుగు మాటలు బదులు కష్టమైన సంస్కృతం మాటాలెందుకు వాడతారో తెలీదు (మత్స్యకారులు ఎందుకు? బెస్త వారు అంటే ఎవరూ నొచ్చుకోరు.)

Comments are closed.