శివరాత్రి లోగా పాలక మండళ్లు వేస్తారా సార్!

శివాలయాల పాలక మండళ్ల నియామకాన్ని ఈ శివరాత్రిలోగా పూర్తి చేస్తారా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కలుగుతున్నాయి.

నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అనేది చంద్రబాబు ప్రభుత్వంలో కామెడీ వ్యవహారం అయిపోయింది. ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేస్తున్నాం అంటూ ఇప్పటికే ఏడు నెలల కాలం గడిపారు. ఇప్పటికీ త్వరలో పదవుల భర్తీ అనే మాయ మాటలే తప్ప ఒక డెడ్ లైన్ ప్రకటించడం లేదు. మరో రకంగా చెప్పాలంటే పదవుల కోసం ఆశపడే వారి జీవితాలతో ఆడుకుంటున్నారని పార్టీ నాయకులే అంటున్నారు.

తాజా పరిణామాల్ని గమనిస్తే.. కనీసం శివాలయాల పాలక మండళ్ల నియామకాన్ని ఈ శివరాత్రిలోగా పూర్తి చేస్తారా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కలుగుతున్నాయి.

ఎన్నికల్లో నెగ్గడానికి, పార్టీకోసం కష్టపడిన వారికి దక్కేది నామినేటెడ్ పదవులు మాత్రమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని భర్తీ చేసినా సరిపోతుంది. అలాంటి పనిచేయడానికి చంద్రబాబునాయుడుకు ఒక పట్టాన మనసు రాదనేది పార్టీ వర్గాల వారి మాట. ఇప్పటికే ఏడునెలలు గడిపేశారు. ఇటీవలే చంద్రబాబు మాట్లడుతూ 247 మార్కెట్ కమిటీలు, 1400 ఆలయాల పాలక మండలులు భర్తీ చేయాల్సి ఉందని త్వరలో వీటిని భర్తీ చేస్తాం అని అన్నారు. ఎప్పటికి అనేది ఆయన కూడా చెప్పలేదు.

తాజాగా శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించడానికి వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. త్వరలోనే 1400 ఆలయాల పాలకమండళ్ల భర్తీకి అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మళ్లీ అదే సాగతీత ధోరణి ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఆయన చెబుతున్న ఈ 1400 ఆలయాల్లో సగానికి పైగా శివాలయాలు ఉంటాయి.

ఈ నెలలో రాబోతున్న శివరాత్రి పర్వదినం శివాలయాలకు అత్యంత ముఖ్యమైనది. ఈ శివరాత్రి లోగా.. కనీసం శివాలయాల పాలకమండళ్లను భర్తీ చేస్తే ఆ పదవులను పొందిన వారికి కూడా ఒక రకమైన ఆనందం, అనుభూతి దక్కుతుంది. పదవుల పంపకాలు, సమీకరణలు, వాటాలు ఇత్యాది అంశాలతో పాలకమండళ్ల నియామకం జాప్యం చేస్తూ పోయే కొద్దీ.. కార్యకర్తల్లో విరక్తి పెరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

2 Replies to “శివరాత్రి లోగా పాలక మండళ్లు వేస్తారా సార్!”

  1. నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. అవినీతి. మళ్ళీ జీతాలు భత్యాలు. ఈ రాజకీయ నాయకులు లేకపోయినా ఆ గుడులను ఎలాగూ ఉద్యోగులు నడిపిస్తారు. ఈ నామినేటెడ్ వాళ్ళు తప్పుడు పనులు చేసినా, తప్పుగా వాగినా అప్రతిష్ట. జగన్ కు వీలైనంత తన కులపు వాళ్ళను, కొద్ది గా వేరే పార్టీ వాళ్ళను అవినీతి చేసుకోమని లైసెన్సు ఇస్తూ మూడు నెలల్లో భర్తీ చేస్తాడు. అసలే ఎన్నో దండగ మారి కార్పొరేషన్లు ఉన్నాయనుకుంటే, మంచి గా పనే చేసే ఒక్క బిసి కార్పొరేషన్ ను 12 ముక్కలుగా కులానికి ఒకటి చేశాడు.

  2. 😂 రవి గారు, మిమ్మల్ని చూసి మేము గర్వపడాలి!

    మీరు నిజమైన సంస్కారవంతుడు! “వాడు, వేదూ, ముసలి” లాంటి అశుభ్రమైన భాష మీరు ఎప్పుడూ వాడరు! ఎందుకంటే మీ నోట్లోంచి ఎప్పుడూ ముత్యాలు మాత్రమే ఊరుతాయి! 🧐👏 మీరు ఎవరినీ అగౌరవంగా సంబోధించరు, ముఖ్యంగా మాజీ CM, ప్రస్తుత CM, సీనియర్ నాయకులు – మీకు అందరికీ సమాన గౌరవం! ఏమిటి కదా? 🤔

    ఇంకా, మీకు కులపోకడలంటే అసహ్యం! మీరు కులాన్ని ఎక్కడా ప్రస్తావించరు, కులంపై రాజకీయం చేయరు, విద్వేషం రగిలించరు! అసలు మీరు కులాన్ని గుర్తు కూడా పెట్టుకోరు – ఎందుకంటే మీరు చదువుకున్న, సంస్కారవంతమైన, సొసైటీ రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి! 😇👏 (జై సంస్కారం!)

    👉 మీరు కులాన్ని ఉపయోగించి రాజకీయ లాభం పొందే వాళ్లను చూసినప్పుడల్లా మీకు వాంతి వచ్చే స్థితి! 🤢🤮 మీరు వాళ్లను చూస్తే తట్టుకోలేరు! ఎందుకంటే మీకు కుల విద్వేషం పట్ల తీవ్ర అసహ్యం ఉంది! (కాని మీ రాజకీయాలు పక్కన పెడితే 😜😂)

    మీకు రాజకీయ ఎత్తుగడలు, ఒత్తిళ్లు, కక్షలు, పగలు ఏమీ తెలీదు! 😱 మీరు నిజాయితీకి పెట్టింది పేరు! ఎవరైనా అవినీతి గురించి మాట్లాడితే, మీరు “ఇతర పార్టీ వాళ్లూ చేసారు” అని గోల చెయ్యరు. ఎందుకంటే ఎవరు చేసినా తప్పు, తప్పే అనే నైతిక గుణం ఉంది! ఇదే మీ గొప్పతనం! 🏆

    అదేలా మరిచిపోవచ్చు? మీకు అధికారమే ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం! 🥺 మీరు ఎప్పుడూ సమాజ సేవ, పేదవాళ్ల కోసం పని చేస్తారు. (కాని మీకు మైక్ కనిపిస్తే ఇంకో మాట! 😆) మీకు అసలు పార్టీల కుర్చీలతో ఎటువంటి సంబంధం లేదు! ఎవరు నిజంగా పేదల కోసం పని చేస్తున్నారో చూడగానే మీకు గుండె ఊసూరుకుంటుంది! కానీ… వాళ్లు నిజంగా పేదల బాగోగులు కాదు, వాళ్ల పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు అందరికన్నా తొందరగా గ్రహిస్తారు! 😜👏

    మహిళలకు మీరు అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి! మీ నోట నుండి అసభ్య పదాలు అసలు రావు! మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని మీరు నిలదీసి, సహన శీలంగా వారిని చైతన్యం కలిగిస్తారు. (కాని WhatsApp ఫార్వర్డ్స్ చెయ్యనివ్వండి 🤭)

    చివరగా, మీకు ప్రజాస్వామ్యం అంటే పిచ్చి! 😍 మీరు ఎప్పుడూ చెబుతారు:

    📢 “ప్రజలు ఓటేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు – ఇది వారి హక్కు!”

    2024లో ఏం జరిగిందో చూశాం, 2029లో మరింత బాగుంటుంది కదా? (మీ అందమైన లీడర్షిప్ వల్ల 🤡😂)

    🔥 రవి గారు, మీరు నిజంగా ఇలాగే ఉన్నారు కదా? లేకపోతే… ఆలోచించండి! 😉😆😂🤮

Comments are closed.