విడి 12 టైటిల్ ఏమిటంటే..!

యుద్దం అనే మీనింగ్ వచ్చేలా ఇంగ్లీష్ పదం ఏమైనా వెదుకుతున్నారు. అలాగే మాఫియా సామ్రాజ్యానికి సరైన ఇంగ్లీష్ పదం కోసం వెదుకుతున్నారు.

ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ సితార సంస్థ సినిమా. ఇప్పటి వరకు టైటిల్ తెలియదు. టీజర్ లేదు. అటు గౌతమ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పుతుందని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

టైటిల్ దొరకడం ఒక సమస్య. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మరో సమస్య. అందుకే టీజర్ విడుదల ఆలస్యమవుతోంది. సినిమా విడుదల డేట్ అనధికారికంగా బయటకు వచ్చేసింది మే నెలాఖరులో విడుదల. మరి ఇక ఇప్పుడైనా టీజర్ ఇవ్వాలి కదా.

అందుకే ఈ రోజు ఫార్మల్ గా త్వరలో టైటిల్ డిసైడ్ చేస్తున్నాం, టీజర్ వస్తుంది అనేలా నిర్మాత నాగవంశీ ట్వీట్ వేసారు. ఈ సినిమా కోసం రకరకాల టైటిళ్లు పరిశీలనలో వున్నాయి. వాటిల్లో యుద్దం అనే మీనింగ్ వచ్చేలా ఇంగ్లీష్ పదం ఏమైనా వెదుకుతున్నారు. అలాగే మాఫియా సామ్రాజ్యానికి సరైన ఇంగ్లీష్ పదం కోసం వెదుకుతున్నారు. టైటిల్ ఫైనల్ కాగానే టీజర్ డేట్ తో అనౌన్స్ మెంట్ వస్తుంది.

ఈ సినిమాను చాలా భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. మొదట ఒక భాగం అనుకున్నది ఇప్పడు రెండు భాగాలుగా మార్చారు. తొలిభాగం మే లో విడుదలవుతుంది. ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ.