ఓటీటీ ఉద్యోగుల అరాచకం!

ఇటీవల ఓ నిర్మాత తన సినిమాను ఓ ఓటీటీ సంస్థకు చూపించారు. ఆ ఓటీటీ సంస్థ ఉద్యోగులు సినిమా గురించి బయట ఇలా ఉంది, అలా ఉంది, అందుకే తీసుకోవడం లేదని చెప్పడం మొదలు పెట్టారట.

ఓ నిర్మాత కోట్లు ఖర్చు చేసి సినిమా నిర్మిస్తారు. ఆ సినిమాను చాలా జాగ్రత్తగా ఎడిట్ రూమ్‌లో దాచుకుంటారు. సంస్థకు చెందిన అతి కొద్ది మంది ఉద్యోగులే సినిమాను చూడగలరు. అలా చంటిబిడ్డను దాచుకున్నట్లు దాచుకున్న సినిమాను, తప్పనిసరి పరిస్థితుల్లో, ఒక్కోసారి బయ్యర్లకు, ఓటీటీ సంస్థల వారికి చూపించాల్సి వస్తుంది. అలా చూపించడం అన్నది నమ్మకంతో. కానీ అలా చూసిన వాళ్లు సినిమా మీద పాజిటివ్ స్ప్రెడ్ చేస్తే ఓకె. అలా కాకుండా నెగిటివ్ చేస్తే కష్టం కదా.

ఇటీవల ఓ నిర్మాత తన సినిమాను ఓ ఓటీటీ సంస్థకు చూపించారు. ఆ ఓటీటీ సంస్థ ఉద్యోగులు సినిమా గురించి బయట ఇలా ఉంది, అలా ఉంది, అందుకే తీసుకోవడం లేదని చెప్పడం మొదలు పెట్టారట. ఈ వార్త అలా అలా ఇండస్ట్రీలో పాకిపోతోంది. ఓటీటీ సంస్థల్లో ఉద్యోగులు బాధ్యతగా ఉండాలి. ఇలాంటి అలవాటు కొన్ని శాటిలైట్ సంస్థల ఉద్యోగుల్లో కూడా ఉంది. సినిమా చూసిన వారు, చూసినట్లు ఊరుకోకుండా, బయటకి వచ్చి “ఇలా ఉంది, అలా ఉంది” అని తమ సన్నిహితులకు చెప్పడం, దాంతో అది బయటకు వెళ్లిపోవడం కామన్ అయింది.

శాటిలైట్ సంస్థల నుంచి ఈ జాఢ్యం ఇప్పుడు ఓటీటీ సంస్థలకు పాకుతోంది. పెద్ద ఓటీటీ సంస్థల ఉద్యోగులందరూ ఎక్కువగా ముంబయికి చెందిన వారు వుంటారు. వాళ్లకు లోకల్ పరిచయాలు పెద్దగా ఉండవు. కానీ కొన్ని ఓటీటీ సంస్థల్లో లోకల్ ఎంప్లాయీలు ఉంటారు. వాళ్లతోనే సమస్య. ఎందుకంటే, వాళ్లకు ఇక్కడ అందరూ పరిచయమే. అందుకే, “సినిమా బాగుంది… బాగాలేదు” అనేది స్ప్రెడ్ అయిపోతోంది. దీంతో సినిమా చూపించాలి అంటే నిర్మాతలు భయపడుతున్నారు.

ఓటీటీ సంస్థల అధినేతలు తమ ఉద్యోగులను ఈ విషయంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

7 Replies to “ఓటీటీ ఉద్యోగుల అరాచకం!”

  1. మరి ఫస్ట్ షో కే రివ్యూ రాసే వాళ్ళను కట్టడి చేయొద్దా??

    వాళ్లకు.. వీళ్ళకు తేడా ఏముంది G A??

      1. comparing elections and movies? election results impact entire country. movie results only impact producers and may some groups of people. if you are supporting ban of free speech, then a day will come when they ban your talking also. be careful what you wish for.

        1. Prathi manishi lo nu manchi chedu vunnaaru. Cinema lo anni bavundali ani ledhu.. kontha mandhiki taking nachhochhu.. kontha mandhiki veredi nachhochhu… Veellu iche so called rating ki…. Producers ki lost so mouth control lo pettukovotam thappu kaadhu

    1. once your product is in public domain, freedom of speech comes in place, anyone can have their opinion and say it as loud as they can via social media. It is categorically different from showing a producer’s film to a select group of people within the film industry for monetary related purposes before its theatrical release.

  2. does telugu film industry not have Non Disclosure Agreements (NDA)? It is a common practice worldwide in almost every business sector. Maybe it is difficult to enforce NDA in Indian Penal Code?

Comments are closed.