నేను కొడితే మామూలుగా ఉండదు!

రాబోయే రోజుల్లో విజయం మనదే. తెలంగాణ ప్రజల విజయం కోసం ముందుకు సాగుదాం

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన అనంతరం ఫామ్ హౌస్‌కే ప‌రిమితం అయిన‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నాను,  నేను కొడితే మామూలుగా ఉండదు,’’ అంటూ హెచ్చరించారు.

ప్రజలు కాంగ్రెస్ పాలనతో అసంతృప్తిగా ఉన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో ఎదురయ్యే పరిస్థితి కూడా మారిపోయిందన్నారు. ‘‘నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ ప్రజలు నా మాట వినకుండా అత్యాశతో కాంగ్రెస్‌కు ఓటేశారు,’’ అని కేసీఆర్ ఆరోపించారు.

ఫామ్ హౌస్ అనే పేరు పెట్టి బద్నాం చేస్తున్నారు

తనపై వస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందిస్తూ, ‘‘నేను మాటాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నాం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో పంటలు తప్ప ఇంకేముంటాయి?’’ అని కౌంట‌ర్ ఇచ్చారు.

రైతు బంధు, దళిత బంధు హామీలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు హామీలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు, అని ఆయన విమర్శించారు.

ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండండి

కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, ‘‘రాబోయే రోజుల్లో విజయం మనదే. తెలంగాణ ప్రజల విజయం కోసం ముందుకు సాగుదాం,’’ అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పొందిన త‌ర్వాత‌, కేసీఆర్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. కానీ, తాజాగా ఆయన తన విమర్శల దాడిని మళ్లీ ప్రారంభించడంతో, కాంగ్రెస్ నేతలు దీనికి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, కాళేశ్వరం అవినీతి, కేటీఆర్‌పై నమోదైన కేసుల వంటి అంశాలపై ఇంకా క్లారిటీ రాలేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కేసీఆర్ బహిరంగంగా విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

12 Replies to “నేను కొడితే మామూలుగా ఉండదు!”

  1. మందు కొడితేనా !!

    నీయబ్బ రే లండన్ నుంచి కొత్త మందులు pichodu testunnadu అవి కొంచెం వాడు.

  2. అవునా.. అలాగా?? ఈడిని పీకి Formhouse లోపడేసినా ఇంకా బలుపు తగ్గలేదనుకుంట.. ‘లేక ఇంకా మత్తులోఉన్నాడో. ఒకడు ప్యాలెస్ లో, ఇంకొకడు formhouse లో సరిపోయారు

  3. అవునా.. అలాగా?? ఈడిని “పీకి Formhouse” లోపడేసినా ఇంకా ‘బలుపు తగ్గలేదనుకుంట.. ‘లేక ఇ0కా ‘మత్తులోఉన్నాడో. ‘ఒకడు ప్యాలెస్ లో, ఇ0కొకడు formhouse లో సరిపోయారు

  4. ఒ!రే!య్ లం!గా నా!యా!ల , ఇప్పటికే నీ పాపాలకి తుంటి ఇరిగి దే!కు!తున్నావ్ , ఇంకో సారి తంతే డైరెక్టుగా నరకానికి పోతావ్ బేవకూఫ్ బాఢకోవ్ ఎదవ

Comments are closed.