సీనియర్ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లకొండ శీనివాస్ ముగ్గురు హీరోలు. గరుడన్ సినిమా కు రీమేక్. ఈ సినిమా ఫిబ్రవరి నెలాఖరులో విడుదల అని తెగ వినిపించింది. టీజర్ విడుదల చేసారు. పాట విడుదల చేసారు. అక్కడితో లెగ్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయారు. ఏమయింది? ఫిబ్రవరిలో విడుదల వుందా? లేదా? అన్నది తెలియదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఫిబ్రవరిలో వుండకపోవచ్చు. ఎందుకంటే ఓటిటి, థియేటర్ అమ్మకాలు జరపకుండా సినిమా విడుదల చేయడం ఈ రోజుల్లో చాలా పమాదకరం. థియేటర్ హక్కులు ఎవరూ కొనకున్నా అడ్వాన్స్ ల మీదనే విడుదల చేసుకోవచ్చు ధైర్యం చేసి. కానీ నాన్ థియేటర్ హక్కులు విక్రయించకుండా సినిమా డేట్ వేయడం చాలా అంటే చాలా ప్రమాదం. అందుకే భైరవం సినిమా విడుదల పూర్తిగా డౌట్ లో పడింది.
నాన్ థియేటర్ లో ముఖ్యంగా డిజిటల్ హక్కులు కీలకం. కానీ పట్టుమని అరడజను ఓటిటి సంస్థలు లేవు. ఫిబ్రవరిలో వచ్చే సినిమాలను కొనేసారు. మార్చిలో వచ్చే సినిమాలే లేవు.సమ్మర్ ఫుల్ టైట్. ఇలాంటి నేపథ్యంలో భైరవం సినిమా ఓటిటి అమ్మకాలు జరగాలి. అప్పుడు కానీ డేట్ రాకపోవచ్చు.
ముగ్గురూ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన హీరోలు…