టాలీవుడ్‌లో పార్టీలు కొత్త కాదు, విజయోత్సాహాలు కూడా కొత్త కాదు. అయితే సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పార్టీ అయినా అది నిర్మాత ఇచ్చేదే. కానీ ఫస్ట్ టైమ్ ఫర్ ఏ ఛేంజ్ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బయ్యర్లు అంతా కలిసి సినిమా నిర్మాణ యూనిట్ కు పార్టీ ఇవ్వబోతున్నారు. ఇది కాస్త చెప్పుకోదగ్గ సంగతే.
ఏపీ, సీడెడ్ అన్ని చోట్లా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండూ కలిపి దాదాపు 110 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. ఇందులో సంక్రాంతి కి వస్తున్నాం వాటా గట్టిగా పాతిక కోట్లు కూడా లేదు.
గేమ్ ఛేంజర్ సినిమా వల్ల బయ్యర్లు అంతా దారుణమైన నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారిని కాపాడింది. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల వసూళ్లు సాధించింది. రెండు సినిమాలకు కలిపి పెట్టిన డబ్బులను రాబట్టి, ఇంకా లాభాలు తెచ్చిపెట్టింది.
అందుకే బయ్యర్లు అంతా కదిలి హైదరాబాద్ వస్తున్నారు. వస్తూనే మీడియా మీట్ పెట్టి, మీడియా ముఖంగా సినిమా యూనిట్ కు, దర్శకుడు అనిల్ రావిపూడికి, హీరో వెంకీ కి థాంక్స్ చెప్పబోతున్నారు. ఆ రాత్రి యూనిట్ కు బయ్యర్లు అంతా కలిసి పార్టీ ఇవ్వబోతున్నారు. అలాగే ఆ మరునాడు బయ్యర్లకు, యూనిట్ కు షీల్డ్ ల ప్రెజెంటేషన్ వుంటుంది.
అంతా మాయ లోకం
అంతా డబ్బు మాయం… ఈ జగమంతా డబ్బు మాయం…
అదే వెంకటేష్ సినిమా కూడా పోతే, ఆ నిర్మాతని బండ బూతులు తిట్టేవారు…
అంత డబ్బులు సినిమాకి పెట్టడం దేనికి?
పోతే ఏడవడం దేనికి?
Idhoka publicity dil rajuku intha jarigina budhi raledhu .e vishyam incum tax vallaku teliyali malli vachi party valle istharu