ఇన్నాళ్లూ నిర్మాతలకు హీరోల నుంచి ప్రెషర్ ఉండేది. పబ్లిసిటీ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇన్ని కోట్ల పోస్టర్‌లు వేయాలి, ఇన్ని రికార్డులు అంటూ ప్రకటించాలి అనేవి. ఇదంతా వాళ్ళ మార్కెట్ నిలబెట్టుకోవడం కోసం చేసేవారు. చేస్తున్నారు కూడా. ఇప్పుడు హీరోలు కాస్త సైలెంట్‌గానే ఉంటున్నారు. కానీ డైరెక్టర్లు రంగంలోకి దిగారు. యంగ్ డైరెక్టర్ల మధ్య కనిపించని పోటీ పెరిగింది. యంగ్ డైరెక్టర్లు అయిదు నుంచి పది కోట్లకు, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తున్నారు. దాంతో పాటు తరువాత అవకాశాలు అందిపుచ్చుకోవాల్సి ఉంది.
అందువల్ల కింద పడ్డా మీదే పడ్డామనే రీతిలో మాట్లాడుతున్నారు. తమ సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. సినిమా యావరేజ్ అయినా, జస్ట్ హిట్ అయినా, బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌కు కొంచెం దూరంలో ఆగిపోయినా, నిర్మాత జిఎస్టీలు కట్టుకోవాల్సి వస్తున్నా ఈ యంగ్ డైరెక్టర్లకు పట్టడం లేదు. సినిమా బ్లాక్‌బస్టర్ అని పోస్టర్‌లు వేయించడం, లాభాలు వచ్చేసాయి కొన్నవాళ్ళకు అని చెప్పించడం కోసం నిర్మాతలను వత్తిడి చేస్తున్నారు.
ఈ ట్రెండ్ రెండు మూడేళ్లుగా మొదలైంది. నిర్మాణాలకు భారీగా ఖర్చు చేయించినా, తాము బడ్జెట్ లిమిట్‌లోనే తీసామని చెప్పడం, నిర్మాతల చేత కూడా అదే చెప్పించడం కామన్ అయింది. కొంత మంది యంగ్ దర్శకులు చేసే సినిమాలు హిట్ అయినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఉండడం లేదు. లాభం మిగలడం లేదు. అక్కడిక్కడ సరిపోతోంది. బై మిస్టేక్ సినిమా సరిగ్గా ఆడకపోతే నిర్మాత చేతులు కాలుతున్నాయి.
కానీ దీనికి తోడు అడ్డగోలు పోస్టర్‌లు, స్టేట్‌మెంట్‌లు మనసు చంపుకుని ఇవ్వాల్సి వస్తోంది ఈ దర్శకుల వత్తిడి మీద. వీటిని పట్టుకుని ఫ్యాన్స్ హడావుడి చేస్తారు. దాన్ని పట్టుకుని దర్శకులు తరువాత ఇంటర్వ్యూల్లో తమ సినిమాకు లాభాలు వచ్చాయని, నిర్మాతే చెప్పారని అడ్డగోలుగా వాదిస్తారు. ఇదో ట్రెండ్. కొన్నాళ్లు ఇలా సాగుతుంది కొందరికి.
మూర్తి గారు ఇదే question మీరు press-meet లో
సదరు నిర్మాత ని అడిగి మొహమాటం పెట్టారు.
మీkuamantru పనవ్ కలునన్