బన్నీ కాలు స్లిప్ అయిందా?

అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గానే చెప్పి వుండాల్సింది కదా. అదేమీ చెప్పలేనిది కాదు కదా అన్న కౌంటర్ పాయింట్ వినిపిస్తోంది.

చాలా కాలం తరువాత పబ్లిక్ ప్లాట్ ఫారమ్ మీదకు హీరో అల్లు అర్జున్ వస్తారని అంతా ఎదురుచూసారు. తండేల్ జాతర అంటూ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ వస్తారని ప్రకటించారు. అఫీషియల్ గా ప్రకటించారు. ఇన్ హవుస్ ఫంక్షన్ పెట్టారు. స్ట్రిక్ట్ గా అతి కొద్ది మందిని మాత్రమే పిలిచారు అందువల్ల కచ్చితంగా బన్నీ వస్తారని అనుకున్నారంతా.

పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇన్ హవుస్ ఈవెంట్ కనుక. ఫార్మల్ ఇన్ ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ముందు రోజు అనుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల వన్ డే వాయిదా వేసారు. అది కూడా కచ్చితంగా బన్నీ రాకకోసమే అని అనుకున్నారంతా

కానీ బన్నీ రాలేదు. ఈవెంట్ ముగిసే వేళకు వస్తారని అంతా ఎదురు చూసారు. కానీ రాలేదు. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అన్నింటికన్నా కీలకంగా బన్నీ నడుస్తుంటే కాలు స్లిప్ అయి, మెల్తి పడిందని, అందువల్ల రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ అలాంటిది వుంటే తండ్రి అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గానే చెప్పి వుండాల్సింది కదా. అదేమీ చెప్పలేనిది కాదు కదా అన్న కౌంటర్ పాయింట్ వినిపిస్తోంది.

తండేల్ సినిమా బన్నీ చూసి వుంటారని, సంతృప్తి చెంది వుండరని, ఇప్పుడు వేదిక మీదకు వస్తే ష్యూర్ షాట్ హిట్ లాంటి మాటలు చెప్పాల్సి వస్తుందని రాలేదని గుసగుసలు మరోపక్క మొదలయ్యాయి.

సినిమా అల్లు అర్జున్ కుటుంబ బ్యానర్ మీద నిర్మించారు. తండ్రి నిర్మాత. అలాగే తన స్నేహితుడు, సన్నిహితుడు బన్నీవాస్ మరో నిర్మాత. అలాంటి సినిమా ఫంక్షన్ కు బన్నీ స్కిప్ కొట్టారంటే బలమైన కారణం వుండి వుండాలని వినిపిస్తోంది. అది ఏమిటన్నది మెలమెల్లగా బయటకు వస్తుంది.

9 Replies to “బన్నీ కాలు స్లిప్ అయిందా?”

  1. . వూకో గ్రేట్ ఆంద్ర, ఇంకా నయం ప్యాలస్ లో జగన్ స్వయంగా అర్జున్ కి కాలికి పిండి కట్టు వేస్తున్నారు అనలేదు నువ్వు.

Comments are closed.