సొంత ఎమ్మెల్యేకు సీఎం ర‌మేశ్ ప‌రోక్ష హెచ్చ‌రిక‌

సొంత పార్టీకి చెందిన జ‌మ్మ‌ల‌మ‌డుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డికి అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్ ప‌రోక్ష హెచ్చ‌రిక చేశారు.

సొంత పార్టీకి చెందిన జ‌మ్మ‌ల‌మ‌డుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డికి అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్ ప‌రోక్ష హెచ్చ‌రిక చేశారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న కంపెనీకి చెందిన ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప‌నుల్ని ఆదినారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు అడ్డుకోవ‌డాన్ని సీఎం ర‌మేశ్ మ‌రిచిపోలేద‌ని తాజాగా ఆయ‌న ఫిర్యాదుతో అర్థం చేసుకోవ‌చ్చు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు క్ల‌బ్‌లో దేవ‌గుడి నాగేశ్వ‌ర‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న అసాంఘిక కార్య‌క‌లాపాలు, జూదంపై దృష్టి సారించాల‌ని క‌డ‌ప క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌కు సీఎం ర‌మేశ్ లేఖ రాయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 12 టేబుళ్ల‌పై టేబుల్‌కు 9 మంది చొప్పున రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.ల‌క్ష వ‌ర‌కూ జూదం బెట్టింగ్‌గా నిర్వ‌హిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌ట్కా, లిక్క‌ర్ దందా వంటి అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు య‌థేచ్ఛ‌గా పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న క‌డ‌ప ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ రంగు పులుముకుంది.

ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో మ‌రోసారి సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్యే ఆది మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సీఎం ర‌మేశ్‌కు చెందిన కంపెనీ చేస్తున్న ప‌నుల‌న్నీ త‌మ‌కే కావాలని డిమాండ్ చేయ‌గా అంగీక‌రించ‌లేదు. కొన్ని ప‌నుల్ని ఇచ్చామ‌ని, కోరిన‌న్ని ఇవ్వ‌లేమ‌ని సీఎం ర‌మేశ్ కంపెనీ ప్ర‌తినిధులు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో కంపెనీ ప్ర‌తినిధుల‌తో పాటు కార్యాల‌యంపై ఆది అనుచ‌రులు దాడికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ దాడుల్ని సీఎం ర‌మేశ్ మ‌రిచిపోలేద‌ని తాజా ఫిర్యాదుతో వెల్ల‌డైంది. అందుకే అన‌కాప‌ల్లికి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సీఎం ర‌మేశ్‌, త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆది అనుచ‌రుడు నిర్వ‌హిస్తున్న క్ల‌బ్‌లో అసాంఘిక కార్య‌క‌లాపాలు సాగుతున్నాయ‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లే ఆదినారాయ‌ణ‌రెడ్డి ప‌ట్టుద‌లకు పోయే నాయ‌కుడు. సీఎం ర‌మేశ్ ఫిర్యాదు చేశార‌నే కార‌ణంతో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు వెళితే, అడ్డుకునే ర‌కం అని ఆయ‌న అనుచ‌రులు చెప్తున్నారు. కానీ ఆదినారాయ‌ణ‌రెడ్డిని సీఎం ర‌మేశ్ అదును చూసి దెబ్బ తీయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌నే చ‌ర్చ మాత్రం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

2 Replies to “సొంత ఎమ్మెల్యేకు సీఎం ర‌మేశ్ ప‌రోక్ష హెచ్చ‌రిక‌”

  1. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర ఎదుటివాని గుద్దలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎంచడమేనా నీ పని. అలాగే మీ వారికి సంబంధించిన వారికి గుద్దలో వెంట్రుకలు ఉన్నాయోఎంచొచ్చు కదా ? మన మాపని మాత్రం చేయము. మన గుద్ధ మనం కడుక్కోము కానీ ఎదుటివానికి గ**** మాత్రం కడుగుతామంటాం .

    అదేనా నీ స్పెషాలిటీ. ఐదేళ్లు అలుపెరుగక ఇటువంటి వార్తలు వండి వార్చావు ఏం జరిగింది ?

    ఏమి జరిగిందో ప్రపంచానికి తెలిసింది గాని నీకు మాత్రం తెలియలేదు . అదే నీ స్పెషాలిట ?

Comments are closed.