వందకు పైగా సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మరి ఇంతమంది హీరోయిన్లలో బాలకృష్ణకు నచ్చిన హీరోయిన్ ఎవరు?
నాతో నటించిన హీరోయిన్లందరూ నాకిష్టమే అనేది కామన్ సమాధానం. కానీ అక్కడున్నది బాలకృష్ణ. ఆయన నుంచి కామన్ గా ఎందుకు సమాధానాలొస్తాయి. తన కెరీర్ మొత్తమ్మీద తనకు బాగా నచ్చిన హీరోయిన్లు ఎవరో చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
తను నటించిన హీరోయిన్లలో బాలకృష్ణకు బాగా నచ్చిన హీరోయిన్ విజయశాంతి. ఒకప్పుడు వీళ్లిద్దరిది హిట్ కాంబినేషన్. అయితే అంతకుమించి అనుబంధం ఇద్దరిదీ. అందుకే తన టాప్ హీరోయిన్ల లిస్ట్ లో మొదటి స్థానం విజయశాంతిదేనని ప్రకటించారు బాలకృష్ణ.
విజయశాంతి తర్వాత రమ్యకృష్ణ అంటే తనకు చాలా ఇష్టమన్నారాయన. బాలయ్య-రమ్యకృష్ణది కూడా హిట్ కాంబినేషనే. కాకపోతే మొదటి స్థానం మాత్రం ఆమెకు ఇవ్వలేదు. ఇక టాప్-3 లో మూడో స్థానం సిమ్రాన్ కు ఇచ్చారు.
గతంలో బాలకృష్ణ-సిమ్రాన్ కలిసి సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. ప్రగ్యా జైశ్వాల్ పేరు ఆయన చెప్పలేదు. బహుశా, ఆయన టాప్-10 హీరోయిన్ల లిస్ట్ లో ప్రగ్యా జైశ్వాల్ ఉండొచ్చు.
దిక్కుమాలిన ఆర్టికల్
తనకు బాగా నచ్చిన ముగ్గురు హీరోల పేర్లు అడగండి.. చెప్పలేడు. తనే కాదు.. ఏ తెలుగు హీరో కూడా చెప్పడు. ఈగో జాడ్యం.
Rojanu marchipoyadu nbk papam ame ycp
రోజాను మర్చిపోయాడు బాలయ్య
సూపర్
Nee list chepu mundu
Wt abt ur list