చెర్రీ, బన్నీ కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశారు. ఎవడు సినిమాలో మెగాహీరోలిద్దరూ కనిపిస్తారు. కానీ ఇద్దరికీ ఎలాంటి సంబంధం ఉండదు. ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. సినిమా కథ అలాంటిది. దాన్ని మల్టీస్టారర్ కిందే కన్సిడర్ చేశారు మెగా ఫ్యాన్స్. మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేయబోతున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ మాత్రం కాదు.
కన్నడలో హిట్ అయిన బహద్దూర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకు అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ అందిస్తాడని టాక్.
కన్నడలో బహద్ధూర్ సినిమాకు పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. అది సినిమాకు చాలా ప్లస్ అయింది. అదే వాయిస్ ను తెలుగులో బన్నీ చేత చెప్పించాలని చూస్తున్నారట. నిజానికి తెలుగులో ఈ తరహా ప్రయోగాలు చాలానే జరిగాయి. ఎంతోమంది స్టార్ హీరోలు, ఇతర హీరోల సినిమాలకు గాత్రదానం చేశారు. కాకపోతే బన్నీ మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం చేయలేదు.