‘ప్రేమ్’ కోసం డబ్బింగ్ చెప్పనున్న చరణ్?!

తెలుగులో టాప్ లెవల్లో ఉన్న హీరోలు.. బాలీవుడ్ లో టాప్ లెవల్లో ఉన్న హీరోలతో స్నేహం చేయడం ఏమీ కొత్త కాదు. ఈ పరంపరలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ, బాలీవుడ్…

తెలుగులో టాప్ లెవల్లో ఉన్న హీరోలు.. బాలీవుడ్ లో టాప్ లెవల్లో ఉన్న హీరోలతో స్నేహం చేయడం ఏమీ కొత్త కాదు. ఈ పరంపరలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ల స్నేహం వర్ధిళ్లుతోంది. తన తాజా ఇంటర్వ్యూలలో కూడా చరణ్ సల్మాన్ తో తనది ఎంత మంచి స్నేహమో వివరించాడు. తామిద్దరం తరచూ ఫోన్లు చేసుకొంటామని.. తను చేయకపోతే సల్మానే చేస్తాడని.. పెద్దవాడివి అయిపోయావా? అని నిష్కర్షగా మాట్లాడతాడని… తమది అంత మంచి స్నేహం అని చరణ్ చెప్పాడు. చిరంజీవి థమ్సప్ యాడ్ లో చేస్తున్న కాలంలో మొదలైన పరిచయం ఇప్పటికీ కొనసాగుతోందని చరణ్ వివరించాడు. 

ఇప్పుడు ఈ స్నేహానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే… సల్మాన్ కోసం చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడట. స్నేహం కోసం ముందుకొచ్చి.. సల్మాన్ కు తన గొంతును అరువివ్వనున్నాడట చెర్రీ. సూరజ్ ఆర్ భరత్యాజ దర్శకత్వంలో సల్లూ హీరోగా రూపొందిన తాజా చిత్రం “ప్రేమ్ రతన్ ధన్ పాయో'' సినిమా ను తెలుగులోకి డబ్ చేయాలని భావిస్తున్నారు. 

సాధారణంగా భరత్యాజ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. “మైనే ప్యార్ కియా' దగ్గర నుంచి మొన్నటి 'వివాహ్' వరకూ ఆయన హిందీలో రూపొందించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయ్యాయి. ప్రత్యేకంగా నిలిచాయి. మరి ఇప్పుడు ఈ తాజా సినిమా కూడా తెలుగులోకి డబ్ కావడం ఖాయమే. మరి ఇందులో సల్మాన్ పాత్రకు చరణ్ డబ్బింగ్ చెప్పనున్నాడనడమే మరింత ఆసక్తికరమైన విషయం. 

ఒకవేళ సల్లూ రిక్వెస్ట్ చేస్తే.. చరణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనలేడేమో. చరణ్ డబ్బింగ్ చెబితే మాత్రం దీపావళికి విడుదల కానున్న సల్మాన్ సినిమాలో “ప్రేమ్' పాత్రకు కొత్త కళ వచ్చినట్టే.